నమిత సెక్సీ స్ట్రీట్ డాన్సర్!

సినిమా కథ విషయానికి వస్తే స్ట్రీట్ డాన్సర్ అయిన నమిత, హీరో లారెన్స్ ప్రేమలో పడుతుంది. అయితే ఇది వన్ సైడ్ లవ్. తరువాత లారెన్స్, స్నేహను ప్రేమిస్తున్నడని తెలిసి నమిత తన ప్రేమను త్యాగం చేస్తుంది. హీరో ప్రేమ విజయం సాధించడానికి సాయపడుతుంది. స్నేహ ఇందులో కాలేజీ స్టూడెంట్ గా చేస్తోంది. నమిత పాత్ర గురించి దర్శకుడు మాట్లాడుతూ...ఈ సినిమాలో నమిత పాత్ర కేవలం గ్లామరస్ గానే కాకుండా నటనపరంగా తన సత్తాను నిరూపించుకునే అవకాశం ఉన్నది...ఈ సినిమా ద్వారా స్నేహకు ఎంత పేరు వస్తుందో నమిత కూడా అంతే పేరు వస్తుంది...అన్నారు.
కాగా ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించడానికి లారెన్స్ ప్రయత్నించాడు. అయితే ఆ తరువాత మనసు మార్చుకుని సినిమాలో కేవలం నటనకే పరిమితమయ్యాడు.


Click it and Unblock the Notifications











