హాట్ నమితకి బ్యాంకాక్ కి లింకేంటి?
బ్యాంకాక్,నమిత రెండూ హాటే. అందులోనూ ఈ మధ్య నమిత బ్యాంకాక్ లో ఎక్కువ దర్శనమిస్తోంది.అంతేకాదు తన దర్శక,నిర్మాతలను అక్కడ షూటింగ్ పెట్టుకోమంటోంది. దాంతో ఓ దర్సకుడు ఆ విషయం ఆదారం చేసుకుని ఆమెతో ఓ సినిమానే బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసేసాడు. ఆ చిత్రం టైటిల్ యమా ఇన్ బ్యాంకాక్. షూటింగ్ మొత్తం బ్యాంకాక్ లో జరుగుతుందిని చెప్తున్నాడు. అదో కన్నడ చిత్రం. ఎఆర్ బాలు అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్టర్ దానిని డైరక్ట్ చేస్తున్నారు. అతను అంతకుముందు హలో యమా అనే చిత్రం డైరక్ట్ చేసాడు. ఇక బ్యాంకాక్ పై నమితకు ప్రత్యేకమైన ఇంట్రస్ట్ ఏమిటనన్నది ఇప్పుడు చర్చనీయాంసంగా మారింది. ఇక ఇప్పటికే ఆమె కన్నడంలో నమిత ..ఐ లవ్ యు అనే చిత్రం చేసింది. వీటికి తోడు ఆమె అనే చిత్రం కూడా ఒప్పుకుంది.అలాగే నమిత నలభై సంవత్సరాల ప్రౌఢగా 20 ఏళ్ల టీనేజ్ కుర్రాడిప్రేమలో పడే పాత్రలో మరో తమిళ చిత్రం కమిటైంది....త్వరలోనే ఆ చిత్రం తెరరూపం దాల్చబోతోందని సమాచారం. ఇక నమిత తెలుగులో సింహా చేసిన తర్వాత రెండు మూడు ఆఫర్స్ వచ్చినా ఎందుకునో మెటీరియలైజ్ కాలేదు. తమిళంలో ఓ రెండు సినిమాలు నిర్మిస్తానని ఆ మధ్య ప్రకటన కూడా ఇచ్చింది. అందుకోసమే ఈ టాపిక్ రైజ్ చేసారని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











