బాలయ్య సింహా తర్వాత పెద్దగాప్!
సహజంగా సినిమా ఇండస్ట్రీలో అభినయంతో పాటు అందానికి కూడా చాలా ఫ్రిఫరెన్స్ ఇస్తారు అలాంటి వారికే ఆఫర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. జెమిని చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం మైన నమిత, 'ఒక రాజు ఒక రాణి" సినిమాలో నటించిన నమిత తన అంద చందాలతో, అభినయంతో ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకొంది. ఆ తర్వాత అటు తెలుగు, ఇటు తమిళ సినిమాలలో ఏకదాటిగా పని చేయడం వలన వ్యాయామం చేయడానికి సమయం దొరకలేదని నమిత అంటోంది. అందుకే త్వరలో ఏ సినిమాలు చేయకుండా పెద్ద గ్యాప్ తీసుకుని శరీరం మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాని, భారీ గా ఒళ్లు తగ్గించి స్లిమ్ అవుదామనుకుంటున్నాని నమిత చెప్పింది. ప్రస్తుతం బాలకృష్ణతో 'సింహ" చిత్రంలో నటిస్తోన్న నమిత ఈ సినిమా రిలీజయ్యాక కొన్నాళ్లు అజ్ఝాతంలోకి వెళ్లిపోయి నాజూగ్గా మారి తిరిగొస్తానని చెప్తోంది. ఇలాంటి స్టేట్ మెంట్లు లోగడ చాలానే ఇచ్చిన అపరిమిత అందాల నమిత కాస్తయిన తగ్గింది లేదు. ఈ సారయినా వాటిని నిజం చేస్తుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











