సినిమాలు లేక నమిత సైడ్ బిజినెస్ లో..
హాట్ బ్యూటీ నమితకి సినిమాలు తగ్గటంతో ఇప్పుడు సైడ్ బిజెనెస్ లో బిజీ కావటానికి ప్రయత్నిస్తోంది. ఇంతకీ ఆవిడ సైడ్ బిజినెస్ ఏమిటీ అంటే కన్‌స్ట్రక్షన్ కంపెనీ. తాజాగా ఆమె ముంబైలో లో ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించింది. దాని గురించి ఆమె మాట్లాడుతూ..నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది ...ఓ వైపు నటన...మరోవైపు వ్యాపారం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వాటికోసం తగినంత సమయం కేటాయిస్తాను అంది. అలాగే ఇన్నాళ్ళూ తన భారీ అందాలతో ఆకట్టుకున్న నమిత ఇక గ్లామర్ పాత్రలు తగ్గిస్తానంటోంది. ఇక నుంచి యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకోనంటోంది.
ఆ విషయం మాట్లాడుతూ.. నా ఫ్యాన్స్ ని అలరించటానికి కొత్త అవతారం ఎత్తబోతున్నా. ఇదివరకటిలాగా హాట్ సీన్లలో కాకుండా యాక్షన్, అడ్వెంచర్ స్టంట్స్ సీన్లను చేయబోతున్నా. ఇవి నా ఫ్యాన్స్ కు తప్పకుండా నచ్చుతాయని ఆశిస్తున్నా అంది.అలాగే ఇప్పట్లో సినిమాల నుంచి వైదొలిగే ప్రసక్తి లేదు. సినిమారంగాన్ని నేను ఎంతో ప్రేమిస్తా. నాకు ఎంతో గుర్తింపునిచ్చిన ఈ రంగంలోనే మరింత కాలం కొనసాగాలనుంది. తమిళంలో ఆఫర్లు బాగా వస్తున్నాయి అంది.ఇక సింహా తర్వాత ఆమె తో ప్రారంభించిన దేశద్రోహి చిత్రం ఆగిపోయింది.


Click it and Unblock the Notifications











