అది లేకుండా ఉండలేనంటున్న నమిత

తెలుగులో రెండు చిత్రాలు.. తమిళంలో మరికొన్ని సినిమాలు.. అంటూ బిజీగా ఉన్న ఈ అమ్మడుకి ఇటీవల సన్నబడాలని ఓ ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే చికెన్ తినడం మానేయాలని శతవిధాలా ప్రయత్నించిందట.. కానీ తినకుండా ఉండలేకపోయానంటూ ఇలా చెప్పుకొచ్చింది. ''నచ్చినవి తినకుండా బతకడం చాలా కష్టం. మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకోవాలే గానీ.. తిండికి దూరంగా ఉండటం ఎంత సేపు అనుకునేదాన్నీ.. కానీ తీరా ఆచరణలో పెట్టే సమయానికి తెలిసొచ్చింది ఎంత కష్టమో.. కొన్నాళ్లు అతి కష్టం మీద ఉండగలిగాను.. తర్వాత వీలుకాలేదు.. అందుకే తగ్గడం కోసం వ్యాయామాలను మొదలుపెట్టాను''.


Click it and Unblock the Notifications











