సినిమా సగంలో నయనతారతో తగువు
బిల్లా చిత్రం షూటింగ్ సమయంలో నేనూ,నయనతార మొదట్లో సహ నటీమణులుగా మర్యాదగానే నడుచుకున్నాం. చిత్రం సగం షూటింగ్ పూర్తి అయ్యేసరికి కారణం తెలియదు గానీ స్నేహం సన్నగిల్లడం మొదలయిం ది. నిజంగా ఇది బాధాకరమైన విషయం అంది నమిత.అలాగే నయనతార పెళ్లి చేసుకోనున్నట్టు తెలిసింది. ఆమెకు నా అడ్వాన్స్ కంగ్రాట్స్ అని చెప్పింది.ఆమెనుమీరు, నయనతార కలిసి నటిస్తే ఆ చిత్రం హిట్ అనే సెంటిమెంట్ ఏర్పడినట్లుంది అంటే నిజమే..నిజమే. నేను, నయనతార కలిసి తెలుగులో సింహా చిత్రంలో నటించాం. ఆ చిత్రం ఘన విజయం సాధించింది కానీ మా మధ్య ఎందుకనో స్నేహం లేదు అంది.
అలాగే ప్రస్తుతం తన హవా తగ్గలేదని చెపుతూ..నా హవా ఎప్పుడూ తగ్గదు. ఈ మధ్య నా అంతట నేనే కొంచెం గ్యాప్ తీసుకున్నా. బరువు తగ్గించుకునే పనిలో ఉన్నా. సినీ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు నన్ను చూసేం దుకు ఎగబడే అభిమానులును సముదాయించడానికి పోలీసులు పడే అవస్థలు చూస్తే తెలుస్తుంది నా హవా ఏమిటో. అలాంటి అభిమానులకు మంచి చిత్రాలను అందించాలన్నదే నా తపన అంది.తన అభిమాన హీరో గురించి చెపుతూ..నేను నటించిన హీరోల్లో అజిత్ ఆత్మవిశ్వాసం నాకు నచ్చుతుంది. చిత్ర విజయం కోసం ఆయన చేసే పోరాటం, పడే శ్రమ ఆశ్చర్యపరుస్తాయి అంది.


Click it and Unblock the Notifications











