నమిత నుండి రక్షించండి
భారీ అందాల నమిత బారి నుండి తప్పించండి మహా ప్రభో అంటున్నాడు జగన్మోహిని నిర్మాత. ఎప్పుడో ప్రారంభమైన సినిమా ఇప్పటికీ పూర్తి కాకపోవటానికి, తను ఫైనాన్సియర్స్ వలలో ఇరుక్కుపోవటానికి ఆమే కారణమంటున్నాడు. చెప్పిన డేట్ కి అటెండ్ కాదు. సగం పూర్తయింది కదా నిర్మాత ఏం చేయగలడు ఎక్కడకి వెళ్తారనే ధైర్యమో మరేమోగాని ఇలా బిహేవ్ చేస్తోంది. దాని తర్వాత మొదలెట్టిన తెలుగు బిల్లా పూర్తయింది. మరో తమిళ సినిమా ధీ(ఆపరేషన్ దుర్యోధన రీమేక్) పూర్తయింది..అయినా మా సినిమాకు మోక్షం లేదు..అంటూ దగ్గర వాళ్ల దగ్గర వాపోయాడు. అప్పుడు వాళ్ళు నిర్మాతల మండలిలో కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు. అయితే ఆ నిర్మాత నమిత అమ్మగారితో తగువు పెట్టకోవటం కాదు నాకు కావల్సింది..సినిమా పూర్తయి..కాస్త ఈ కస్టాల నుండి తప్పించుకోవటం అన్నాడు.
అప్పుడు వారు నమితను కబురుపంపి సెటిల్ చేసి మిగతా షెడ్యూలు పూర్తి అయ్యేటట్లు చేస్తున్నారని తమిళ పత్రికలు రాస్తున్నాయి. మరో ప్రక్క నమిత ఇక్కడ తెలుగు పరిశ్రమలో సినిమాలు పట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. రాజా హీరోగా, నమిత టైటిల్ పాత్రల్లో మురళీ సినీ క్రియేష్స్ పతాకంపై హెచ్.మురళి నిర్మిస్తున్న జానపద చిత్రం 'జగన్మోహిని'. ఎన్.కె.విశ్వనాథన్ దర్శకుడు. బి.విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఓల్డ్ క్లాసిక్ 'జగనోహ్మిని' చిత్రానికి రీమేక్ గా ఇది రూపొందుతోంది. ఈ చిత్రం కోసం నానక్ రామ్ గూడాలో సెట్స్ వేసి పలు సన్నివేశాలు చిత్రీకరించారు. అనంతరం వైజాగ్, తలకోన, అండమాన్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపారు. కథ పాతదే అయినా దర్శకుడు తెరకెక్కిస్తున్న విదానం కొత్తగా ఉంటుందనీ, గ్రాఫిక్స్ కు చాలా ప్రాధాన్యం ఉందనీ నిర్మాత భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని బ్యాలెన్స్ సన్నివేశాలను పూర్తి చేస్తున్నారు..జూన్ 15న సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. నమిత ఇందులో తాను టైటిల్ రోల్ పోషిస్తోంది..హీరో రాజా ఈ జానపద చిత్రంలో రాకుమారుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి యన్.కె.విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











