నమిత కావాలంటూ పొలిటీషియన్స్
నమితకు రాజకీయనాయకులు నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తమిళనాడులోని డిఎంకె, అన్నా డిఎంకె,కాంగ్రెస్ పార్టీల వారు ముగ్గురూ ఆమెను ఎప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్న నేపధ్యంలో ఆమెకీ డిమాండ్ వచ్చిందని అంటున్నారు. ఎవరికి వారే ఆమెను తమ పార్టీ తరుపున ప్రచారం చేయమని కోరుతూ భారీ మొత్తాలను ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ విషయంపై తమిళ మీడియా తో నమిత మాట్లాడుతూ నన్ను పలు పార్టీలు ప్రచారానికి పిలిస్తున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఒక్కటి నిజం. కాంగ్రెస్ పార్టీ వారు తమ పార్టీ తరుపున ప్రచారానికి పిలిచారు. కానీ నేను రిప్యూజ్ చేసాను. నా పూర్తి కాన్సర్టేషన్ అంతా సినిమాపైనే..అందుకే వద్దన్నా. అయినా రాజకీయాల్లో తిరిగేటంత టైమ్ లేదు. పోనీ ఆ విషయాలు మాట్లాడదామంటే వయస్సు లేదు. అందుకే వారి ఫ్యాన్సీ ఆఫర్స్ ని కాదనల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











