శరత్‌బాబుతో సహజీవనం.. పెదవి విప్పిన నమిత.. కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని..

By Rajababu

దక్షిణాది చిత్ర పరిశ్రమలో నమిత అగ్రతారగా వెలిగింది. తెలుగు, తమిళ భాషల్లో అగ్రహీరోలందరి సరసన మెప్పించింది. గ్లామర్ తారగా ప్రేక్షకులను మెప్పించిన నమిత ఇటీవల తాను ప్రేమించిన వీరాను పెళ్లి చేసుకొన్నది. ప్రస్తుతం దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న నమిత ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్బంగా నమిత పలు విషయాలను పంచుకొన్నారు.

వీరాతో జీవితం

వీరాతో జీవితం

వీరాతో తన జీవితం చాలా బాగున్నది. ప్రస్తుతం వివాహా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాను. త్వరలోనే కెరీర్‌పై తాను దృష్టిపెట్టనున్నాను అని నమిత చెప్పింది.

Recommended Video

60 ఏళ్ళ నటుడితో పీకల్లోతు ప్రేమలో వున్న టాప్ హీరొయిన్..
 శరత్‌బాబుతో సహజీవనం

శరత్‌బాబుతో సహజీవనం

పెళ్లికి ముందు సీనియర్ నటుడు శరత్‌బాబుతో సహజీవనం అని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. అవన్నీ రూమర్లు మాత్రమే అని నమిత చెప్పింది. ఆ వార్తలు నాకు షాక్ కలిగించాయి అని ఆమె పేర్కొన్నది.

మా బంధం మరింత

మా బంధం మరింత

వీరాతో ఎంగేజ్‌మెంట్‌కు ముందు శరత్‌బాబుతో తాను సహజీవనం చేస్తున్నట్టు వచ్చిన వార్తలతో మా బంధం మరింత పటిష్టంగా మారింది. ఆ విషయాన్ని చెప్పుకొని నవ్వుకున్నాం అని నమిత చెప్పింది.

 వయసులో శరత్‌బాబు చాలా పెద్ద

వయసులో శరత్‌బాబు చాలా పెద్ద

వయసులో శరత్‌బాబు నా కంటే చాలా పెద్దవారు. ఆయనతో రిలేషన్ అంటగట్టడం చాలా ఆశ్చర్యం కలిగించింది. నా తండ్రిలాంటి వయసు ఉన్న వ్యక్తితో సంబంధం ఎలా అంటగడుతారో అర్థం కాలేదు. ఆయనతో నాకు డైరెక్టుగా పరిచయం కూడా లేదు అని నమిత చెప్పింది.

గాసిప్ వార్తలు సహజం

గాసిప్ వార్తలు సహజం

సినిమా పరిశ్రమలో ఇలాంటి వార్తలు చాలా సహజం. అయితే ఈ రేంజ్‌లో వార్తలు రావడం కొంత షాక్ గురయ్యాను. వీరాతో చర్చించడంతో మనసు కుదుట పడింది. వాస్తవం లేకుండా మీడియా ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగిస్తుంది అని నమిత చెప్పారు.

 అభిమాని కిడ్నాప్ చేశాడు..

అభిమాని కిడ్నాప్ చేశాడు..

నా జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన ఎదురైంది. నా అభిమాని ఒకరు నన్ను కిడ్నాప్ చేశాడు. ఆ ఘటన 2009లో జరిగింది. నేను షూటింగ్‌‌లో పాల్గొనేందుకు కోయంబత్తూరుకు వెళ్లాను. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే మీ డ్రైవర్‌ను నేనే అని ఓ వ్యక్తి వచ్చాడు. నేను, మేనేజర్ నిజమే అనుకొని వాహనంలో ఎక్కి కూర్చున్నాం. నేను హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పాటల వింటూ నిద్రపోయాను.

 అభిమాని కిడ్నాప్ చేసి పెళ్లి..

అభిమాని కిడ్నాప్ చేసి పెళ్లి..

ఎంతకీ మేము చేరుకోవాల్సిన స్పాట్ రాకపోవడంతో అనుమానం వచ్చింది. డ్రైవర్ విచిత్ర ప్రవర్తన కూడా సందేహం కలిగించింది. అంతలోనే నా వాహనాన్ని ఐదారు వాహనాలు వెంటాడాయి. ఆ తర్వాత ఏమిటని అడిగితే మీరు కిడ్నాప్ అయ్యారు అని నా మేనేజర్ చెప్పాడు. నన్ను కిడ్నాప్ చేసి నా అభిమాని నన్ను పెళ్లి చేసుకోవాలనుకొన్నాడు.

 పెళ్లికి ముందు వీరాకు బ్రేకప్

పెళ్లికి ముందు వీరాకు బ్రేకప్

పెళ్లికి ముందు వీరాకు కూడా బ్రేకప్ జరిగింది. ఆయన జీవితంలో ఇద్దరు, ముగ్గురు లవర్స్ ఉండేవారు. అంతేకాకుండా ఓ ఫారిన్ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉండేది. వారి మధ్య బ్రేకప్ జరిగింది. కానీ వారిద్దరూ ఇప్పటికీ మంచి స్నేహితులే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X