twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు చెమట పడితేనే...నమిత

    By Staff
    |

    Namitha
    చెమటలు పట్టే వరకు కష్టపడందే కొవ్వు కరగదని నమిత నిర్మొహమాటంగా చెబుతోంది. ఈ మధ్య తరుచూ నమిత తను ఎక్సరైజులు చేస్తున్నానని, డైలీ జిమ్ కు అటెండవుతున్నానని ఎస్టాబ్లిష్ చేస్తోంది. ఎందుకలా అంటే తెలుగులోనూ వరస ఆఫర్స్ సంపాదించాలనే ప్రయత్నం అంటున్నారు. ఇంత బిల్డప్ ఇచ్చినా భిల్లా తర్వాత దేశద్రోహి చిత్రం మాత్రమే ఆఫర్ వచ్చింది. అందరూ ఆమెను హీరోయిన్ గా పనికి రాద అంటున్నారని ఆమె భాద అని తెలుస్తోంది. అయితే ఇక్కడ ఆఫర్స్ వస్తే నే కాస్త సొమ్ము చేసుకోవచ్చుననేది ఆమె ఆలోచన అంటున్నారు. అప్పటికీ ఆమె హీరోలను, నిర్మాతలను రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే జిమ్, ఫిటెనెస్ అంటూ ఊదరకొడుతోంది.

    దేశద్రోహి చిత్రంలోనూ, ఆ మధ్య నటించిన వ్యాపారి చిత్రంలో సన్నివేశపరంగా ఫిట్‌ గా కనిపించేందుకు జిమ్‌ కెళ్లి వ్యాయామాలు చేశానని చెబుతోంది. ఇటీవలే నమిత జిమ్‌ లో వ్యాయామం చేసే స్టిల్ బయటకొచ్చింది. అయినా కనపడిన వారికల్లా తాజాగా ఆమె నటిస్తోన్న దేశద్రోహి సినిమా కోసం 9 కేజీల బరువు తగ్గించుకున్న విధానాన్ని రకరకాలు చెబుతోండటం మాత్రం బోర్ అంటున్నార. భూమిక భర్త భరత్‌ ఠాగూర్ యోగాతో పాటు ఆయన చెప్పిన బాడీ ఎక్సర్‌సైజ్ కూడా చేస్తున్నాని చెప్తోంది. అందుకు తగిన విధంగా శిక్షణ కూడా పొందుతోంది. ఒళ్ళు తగ్గటం కన్నా ఈ పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి ఆమె పడే తిప్పలలు చూసి అంతా నవ్వుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X