నమితలో ఆ టాలెంట్ కాస్త ఎక్కువే...

దాంతో వారంతా నమిత అంటే అందాలు అలవోకగా ఆరబోసే హీరోయిన్ మాత్రమే అనుకునే వాళ్ళు మనస్సులు మార్చుకున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సాధారణంగా హీరోయిన్స్ లో చాలామంది బిల్డప్ కోసమో మరెందుకో షాట్ బ్రేక్ లో ఇంగ్లీష్ నవల్లు చదువుతామని చెప్తూంటారు,పుస్తకాలు పట్టుకు కూర్చుంటారు. అయితే నమిత మాత్రం గ్యాప్ లో పుస్తకాలు చదవదుట..సీన్ పేపర్లే బట్టీ పడుతూ కూర్చుంటుందిట. దాంతో అంతా కల్చర్ తెలియదు,లిటరేచర్ తెలియదు అంటూ ఆడిపోసుకుంటున్నారుట.
అయితే ఈ 'Indiravizha' షూటింగ్ సమయంలో ఆ చిత్రం రచయిత చారు నివేదిత వచ్చిందిట. ఆమె నమితకు తను రాసిన జీరో డిగ్రీ అనే నవల ప్రెజెంట్ చేసిందిట. అయితే నమిత ఆ నవల ఆల్రెడీ చదివేసానని చెప్పి షాకిచ్చిందచిట. అంతేగాక దాదాపు అరగంట సేపు ప్రస్తుతం వస్తున్న సాహిత్యంపై కంటిన్యూగా మాట్లాడిందిట. దాంతో అక్కడున్న యూనిట్ వారంతా అదిరిపోయేటట్లు చూసి నమిత పై తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. నమితలో ఆ టాలెంట్ కాస్త ఎక్కువే...అని మెచ్చుకున్నారు. కాబట్టి సినిమా సంఘటనలు అప్పుడప్పుడూ జీవితంలో కూడా జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











