నమిత దగ్గర నేర్చుకోవటానికి కుర్రాళ్ళు క్యూ
భారీ అందాల నమిత త్వరలో ఓ డాన్స్ స్కూల్ ప్రారంభించనుంది. అయితే అరకొర డ్రస్సులతో సెక్స్ అప్పీల్ ఒలికిస్తూ తెరపై తైతక్కలాడే ఆమె డాన్స్ స్కూల్ పెట్టడమేమిటి అనే డౌట్ చాలా మందికి వచ్చింది. అయితే ఆమె ప్రొపిషనల్ క్లాసికల్ డాన్సర్ అనే విషయం వెల్లడించింది. తనకు డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి ప్రాణమని అందుకే రిలేటెడ్ గా ఉన్న నటనను కెరీర్ గా ఎంచుకున్నానని అంటోంది. ఇప్పటికీ తాను షెడ్యూల్ గ్యాప్ వచ్చినప్పుడల్లా డాన్స్ ప్రాక్టీస్ చేస్తానంటోంది. ఇక తాను పెట్టబోయే డాన్స్ స్కూల్ కి సరైన ప్లేస్ కోసం వెతుకుతున్నానని, అది దొరకగానే వెంటనే ప్రారంభిస్తానని అంటోంది. అలాగే తాను చాలా ప్రతీ విషయంలోనూ చాలా శ్రద్దగా ఉంటానని, అదే శ్రద్దతో తన శిష్యులకు కూడా డాన్స్ పాఠాలను నేర్పుతానని హామీ ఇస్తోంది. ఈ విషయం తెలిపిన వెంటనే ఆమె దగ్గరకి డాన్స్ నేర్చుకునేందుకు చాలా మంది కుర్రాళ్ళు ఎగబడుతున్నారు.


Click it and Unblock the Notifications











