నమితా రాణాతో నిజమేనా?
బిల్లా సినిమాతో రీ ఎంట్రి సక్సెస్ పుల్ గా అవుతుందని, తెలుగులో సెటిల్ అవ్వచ్చని భారీ అందాల నమిత ఆశపడింది. అయితే బిల్లా తిరగపడటంతో ఆమె బికినీ లో చూపిన అందాలు కూడా వృథా అయ్యాయి. అయితే సురేష్ ప్రొడక్షన్స్ నుండి ఆమెకు అనుకోకుండా ఆఫర్ వచ్చిందని తెలిసింది. అప్పట్లో భైరవి పేరుతో జెమినీలో వెంకటేష్ ప్రక్కన చేసిన ఆమెకు తిరిగి వెంకీ ప్రక్కన అవకాశమిస్తామన్నారని సమాచారం. అయితే తాజాగా నిర్మాణమవుతున్న రాణా సినిమాలో ఐటం సాంగ్ లో చేస్తేనే ఆ ఆఫర్ ఇస్తానని వారన్నట్లు చెప్పుకుంటున్నారు. దాంతో నమిత కన్పూజ్ అయిపోయింది.
అయితే రాణాతో చేస్తున్న సినిమాని డైరక్ట్ చేస్తున్నది శేఖర్ కమ్ముల. ఆయన ఇలాంటి ఐటం సాంగ్స్ ని ఎంకరేజ్ చేస్తారా అనేది అందరికీ డౌట్ వస్తోంది. ఏదైమైనా నమిత మాత్రం తన పాత పరిచయాలన్నిటినీ మాత్రం తడుముతోందని చెప్తున్నారు. అయితే హీరోయిన్ గానే ఎంట్రీ ఇవ్వాలనేది ఆమె కోరిక. కానీ అంత బొద్దు గుమ్మ తమిళంలో ఆదరించినట్లుగా మనవాళ్ళు ఆదరిస్తారా అనేది సందేహమే. అయినా త్వరలో ఆమె నటించిన జగన్మోహిని రిలీజ్ అవబోతోంది కదా..దాన్ని బట్టి ఇక్కడ ఆదరణ ఉందా లేదా అన్నది తేలుతుంది.


Click it and Unblock the Notifications











