'సింహా' తర్వాత నమిత కమిటయిన కొత్త చిత్రం
బాలకృష్ణ సరసన నటించిన 'సింహా' ఘన విజయం సాధించటంతో నమిత చాలా ఉషారుగా ఉంది. ఈ చిత్రానికి ముందు కొంతకాలంగా ఆమె నటించిన సినిమాలన్నీ నిరాశపరచాయి. హిట్టుకు మొహం వాచిన ఆమెకు ఈ చిత్రం కిక్ ఇచ్చింది. దాంతో ఇటీవల మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె మళ్ళీ మీడియాను కలిసి తన లేటెస్ట్ చిత్ర విశేషాలను వివరించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమె తాజాగా కమిటయిన తమిళ చిత్రం ఇళంజన్. దానికి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కథ, కథనం సమకూర్చారు. గీత రచయిత పా.విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్యా నంబిశన్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సురేష్ కృష్ణుకు ఈ చిత్రం ఆయన 50వ చిత్రం కావడం విశేషం. ఇక నమిత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..ఈ చిత్రంలో నటించడం గురించి నమిత మాట్లాడుతూ ఇళంజన్ చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా థ్రిల్లింగ్ గా ఫీలవుతున్నాను. ఇందులో నాది కీలకపాత్ర. అలాగే ఈ పాత్రను ఒప్పుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. చిత్ర కథ, కథనం, సంభాషణలు ముఖ్యమంత్రి కరుణానిధి అందించడం, దర్శకుడు సురేష్ కృష్ణకు 50వ చిత్రం కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానను. అలాగే త్వరలో సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె చెప్పింది.


Click it and Unblock the Notifications











