నమిత వివాహం అతనితో ఖరారు!?
భారీ అందాల నమిత వివాహం త్వరలో జరగనుందని చెన్నై సినీ వర్గాల సమాచారం. వరుడు మరెవరో కాదు ఆమెకు లీగల్ ఎడ్వైజర్ గా ఉంటున్న ఓ చెన్నై కుర్రాడని తెలుస్తోంది. ముంబైలో సెటిలైన అతనితో ఆమె కొంత కాలంగా డేటింగ్ చేస్తోందని,త్వరలోనే పెద్దల అనుమతితో వివాహం చేసుకోవచ్చని చెప్తున్నారు. సినిమాలు లేక ఖాళీ పడిన ఆమె ఈ మధ్యన రియల్ ఎస్టేట్ ఫీల్డులో దాదాపు పది కోట్ల వరకూ మొత్తం పెట్టుబడి పెట్టింది. ఆ ఆస్తి వ్యవహారాలు చూసుకోవటానికి ఆమె ఓ లీగల్ ఎడ్వైజర్ ని నియమించుకుంది. తరుచూ అతనితో కలవటం,మాట్లాడటం నేపధ్యంలో ఇద్దరూ ఒకరికొకరు ఆకర్షితులు అయ్యారని,అది ప్రేమకి దారి తీసిందని తమిళ పత్రికలు రాసుకొచ్చాయి. ఇక లీగల్ ఎడ్వైజర్ ని చేసుకుంటే తన భర్తగానే కాక,తన ఆస్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆమె భావించే ఈ నిర్ణయానికి వచ్చిందని చెప్పుకుంటున్నారు.
అందుకు నిదర్సనంగా నమిత తన మకాం ని చెన్నై నుంచి ముంబైకు మార్చటాన్ని చూపిస్తున్నారు. ఇక మొదట్లో ఆమె భరత్ కపూర్ అనే వ్యక్తితో డేటింగ్ చేసేది. అయితే ఆ తర్వాత ఇద్దరికీ విభేధాలు వచ్చి విడిపోయారు. అప్పటినుంచీ ఆమె సింగిల్ స్టేటస్ నే మెయింటైన్ చేస్తోంది. ఇక తెలుగులో సింహా తర్వాత ఆమె ఏ సినిమా ఆమె కమిట్ కాలేదు. దేశద్రోహి వంటి ఒకటి రెండు చిత్రాలు ఓకే అయినా ఆమె రిలీజ్ దాకా వెళ్లలేదు. అయితే రీసెంట్ గా బినామీలపై ఓ యువతి చేసే పోరాటం కధాంశంగా 'శుక్ర'అనే చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రంలో నమిత స్పెషల్ బ్రాంచ్ పోలీసాఫీసర్‌గా కనిపించనుంది. ఇప్పటివరకూ అనేక గ్లామర్ పాత్రలు పోషించిన నమిత స్పెషల్ బ్రాంచ్ పోలీసాఫీసర్‌గా కనిపించటమే స్పెషల్ అనిచెప్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన రవివర్మ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.


Click it and Unblock the Notifications











