విప్పితేనే వారికి తృప్తి: నమిత
భారీ అందాల నమిత తన అభిమానలు తన అందాలు చూడటానికి ప్ర్తత్యేకించి వస్తారని, వారిని సంతృప్తి పరచటమే తన లక్ష్యం అని స్పష్టం చేసింది. తాజాగా దేశద్రోహి చిత్రంలో పోలీస్ పాత్రను పోషిస్తున్న ఆమె తాను పోలీసు పాత్రలు పోషించినా తర్వాత గ్లామర్ పాత్రలు ఆపననీ చెప్పుకొచ్చింది. అలాగే ఆ పాత్రలు ఆపితే తన ఫ్యాన్స్ ఒప్పుకోరని అంటోంది. విజయశాంతి తరహాలో తాను పోలీసు పాత్ర పోషించడం లేదనీ, ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాననీ చెప్తోంది. అలాగే ఆమెకు ఇష్టమైన పోలీస్ అధికారిణి కిరణ్ బేడీ అని చెప్పింది.
ఈ పోలీసు ఆఫీసర్ పాత్రకోసం తాను 7 కేజీల వరకూ బరువు తగ్గానని భారంగా చెప్పిన నమిత. అందరూ ఆశ్చర్యపోయేలా తన ఒళ్లును ఇంకా తగ్గిస్తానని చెపుతోంది. కొందరు తారలు యోగా, తదితర మార్గాల ద్వారా స్లిమ్‌గా తయారవవచ్చని చెప్పారని..కానీ తాను మాత్రం తిండి తగ్గించానని చెపుతోంది. అంతేగాక విజయశాంతి కర్తవ్యం, తర్వాత "రౌడీ ఇన్స్‌స్పెక్టర్"తో పాటు పలు పాత్రలు పోషించిందని చెపుతూ, అప్పుడు గ్లామర్ వేరు, ఇప్పుడు గ్లామర్ వేరు అని చెప్పింది. ఇప్పుడు గ్లామర్‌ను గురించి మరింత విశదపరుస్తూ, ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత గ్లామర్ అనేదే నేటి ఫార్ములా అని చెప్పింది. అయితే ఆర్టిస్టుగా తాను అన్ని తరహా పాత్రలు పోషించడానికి రెడీగా ఉన్నానని సమర్ధించుకుంది.


Click it and Unblock the Notifications











