నమిత సొంత డబ్బులు ఏ హీరోకి ఇస్తుంది?
భారీ అందాల నమిత త్వరలో నిర్మాతగా మారి కంటెన్యూగా సినిమాలు చేయనుంది. ఈ మేరకు ఆమె కొందరు తమిళ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో పెరిగిన బరువు తగ్గించుకునే పనిలో ఉన్న నమిత..కొత్త ప్రాజెక్టులు ఏమీ ఒప్పుకోవటం లేదు. దాంతో నమిత త్వరలో పెళ్ళిచేసుకోబోతోంది..అందుకే సినిమాలు ఒప్పుకోవటం లేదంటున్నారని ఆమె అస్సలు విషయం తెలియబరిచింది. ఇన్నాళ్ళు తనకిష్టం ఉన్నా లేకపోయినా దర్శకుడు, నిర్మాత చెప్పిన పాత్రలు చేస్తూ వచ్చాయని, ఇక నిర్మాతగా తన మనస్సుకు నచ్చే పాత్రలు చేయనున్నానని ఆమె అంటోంది. అలాగే ఆమె హీరోయిన్ గా చేసిన సింహా చిత్రం భాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించటం ఆమెకు ఆనందాన్ని కలగచేస్తోందని చెప్తోంది. ఇక నమిత..నిర్మాతగా మారి మొదటి చేసే చిత్రంలో హీరో ఎవరు చేయనున్నారనేది చెన్నై సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
నమిత సింహా బోయపాటి శ్రీను నయనతార స్నేహా ఉల్లాల్ చెన్నై namitha boyapati srinu nayantara sneha ullal mumbai simha


Click it and Unblock the Notifications