»   »  నమిత లైంగిక వేధింపులు

నమిత లైంగిక వేధింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Namitha
అవును ...ఇప్పుడు హాట్ హీరోయిన్ నమిత హీరో శ్రీకాంత్ (ఒకరికి ఒకరు ఫేమ్ శ్రీరామ్ ) ని లైంగిక వేధింపులు చేయటానికి రెడీ అవుతోంది. తాజాగా తమిళంలో ఆమె చేస్తున్న 'ఇందిరావిజ' సినిమాలో ఈ సీన్స్ ఉంటాయట. ఈ సినిమాలో నమిత పాత్ర విని యేమంటుందో అని దర్శకుడు రాజేశ్వర్ చాలా టెన్షన్ పడ్డాడుట. కాని విన్న వెంటనే నమిత ఎగిరి గంతేసినంత పని చేసిందిట. చాలా ఈజీగా తీసుకుని ఈ విచిత్రమైన క్యారెక్టరైజైన్ కి కొత్త ఆలోచనలు చెబుతూ అల్లుకుపోయిందిట. షాకయి చూస్తున్న వారితో ఇటువంటి పాత్రలే విమర్శకుల ప్రశంసలు పొందుతాయని ఆనందంతో చెప్పిందిట.

ఇంతకీ ఈ సినిమా ఆ దర్శకుడు సొంత బుర్రలోంచి పుట్టింది కాదట. హాలీవుడ్ సెక్సీ స్టార్ డెమీ మూర్ నటించిన డిస్ క్లోజర్ అనే సినిమాకి ఫ్రీమేక్ ట. అందులో మైఖల్ డగ్లస్ చేసిన పాత్ర శ్రీరామ్ చేస్తున్నాడుట. అతను ఓ కార్పోరేట్ కంపెనీలో కంఫర్ట్ గా పని చేస్తూంటాడు. పర్సనల్ లైఫ్ లోనూ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటూంటాడు. కొంత కాలానికి అతనికి బాస్ గా ఓ అమ్మాయి వస్తుంది. ఆమె ఎవరో కాదు. అతని మాజీ లవరు. ఆమె అతన్ని చూడగానే రెచ్చిపోయి ఉద్యోగానికి ఎసరు పెట్టటానికి రెడీ అవుతుంది. తర్వాత కాళ్ళ బేరానికి వచ్చిన అతనిని సెక్స్ వల్ హెరాస్ మెంట్ చేయంటం ఫ్రారంభిస్తుంది. ఆ పాత్రలో నమిత జీవించబోతోందట. ఈ కధనే వెజ్ గా మార్చి తెలుగులో శుభలగ్నం అని అప్పట్లో చేసారు ఎస్వీ కృష్ణారెడ్డి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X