అది తగ్గిస్తే నమితను ఎవరు బుక్ చేస్తారు
తాజాగా భారీ అందాల నమమితకు సెక్స్ పోజింగ్ చేయకూడదనే బుద్ది పుట్టింది. అందుకు తగినట్లుగా ఆమె స్టేట్ మెంట్ లు ఇస్తోంది. అయితే కెరీర్ ప్రారంభించి ఇన్నాళ్లయినా నటన గురించి కొద్దిగా కూడా తెలుసుకోని ఆమె ఇలా మారిపోతే తమ సినిమాల్లో తీసుకోవాల్సిన అవసరం ఏమిటంటున్నారు.
ఎక్స్‌పోజ్ చేసీ చేసి నమితకు బోర్ కొట్టినట్లుంది. "ఇక మీదట నా డ్రెస్సింగ్ స్టయిల్ మార్చబోతున్నాను' అంటున్నారు సెక్సీ హీరోయిన్ నమిత. కెరీర్ ప్రారంభంలో అందరు హీరోయిన్లలాగానే అవసరమైన మేరకు మోడ్రన్‌గా కన్పించారు ఆమె. ఆ తర్వాత స్లోగా... ఓవర్ ఎక్స్ పోజింగ్‌తో హీరోయిన్‌కి ఎక్కువ... డాన్సరుకు తక్కువలా మారిపోయారు నమిత. దానికి కారణం తన పర్సనల్ ఇంట్రెస్ట్ కాదని, దర్శకులు ఆ విధంగా కోరుకున్నారని నమిత చెబుతున్నారు.
తన వ్యక్తిగత అభిరుచికి కూడా అది విరుద్ధమని నమిత అంటున్నారు. అన్నిటికన్నామించి అభిమానుల కోరికను తాను ఎక్కువగా పరిశీలనలోకి తీసుకోవడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. అమాయ కత్వాన్ని ఒలకబోసే హీరోయిన్ పాత్రల్లో చేయాలని కోరికగా వుందని నమిత ఇప్పుడు చెబుతున్నారు. సద్మా, చాల్‌బాజ్, జబ్ వియ్ మెట్ చిత్రాలలో నాయిక అటువంటి పాత్రల్లో చేయమని ఎవరూ అప్రోచ్ కాలేదని, ఎవరైనా అటువంటి ప్రతిపాదనలతో వస్తే సంతోషంగా ఆ చిత్రాలు అంగీకరిస్తానని నమిత అంటున్నారు. అటువంటి పాత్రలు పోషించాలంటే కొంచెం లావు తగ్గవలసిన అవసరం ఎంతైనా వుంది. ఆ దిశగా కూడా నమిత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది మరి అని సలహా లు ఇస్తున్నారు. ప్రస్తుతం నమిత బాలకష్ణ,బోయపాటి శీను కాంబినేషన్లో రెడీ అవుతున్న సింహాలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











