twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాలో నమిత రకరకాల ‘బికినీ’లలో...

    By Srikanya
    |

    భారీ అందాల నమిత మరోసారి బికినీలో కనపించి అలరించనుంది. అయితే ఈ సారి తెరపై రకరకాల బికినీల్లో కనపించటం ఈ చిత్ర విశేషం. ఆ చిత్రం పేరు 'బెకినీ బిరుగల్లే'. ఈ చిత్రంలో నమిత తన అందచందాలను తెరపై గుమ్మరించిందని టాక్. కన్నడ భాషలో రూపొందుతున్న ఈ చిత్రానికి అప్పుడే అన్ని భాషల నుండి డబ్బింగ్ ఆఫర్స్ వస్తున్నాయని, మార్కెట్ లో సైతం ఈ సినిమాకు మంచి క్రేజ్ రావటంతో అంతా ఎగబడుతున్నారని కన్నడ ట్రేడ్ టాక్. ఈ విషయమై తనను కలిసిన మీడియాతో నమిత మాట్లాడింది.

    నమిత మాట్లాడుతూ... బికినీ అనేది ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. అలాగని అనవసరంగా ఎప్పుడూ నేను బికినీ వేయలేదు. సన్నివేశానుగుణంగానే బికినీ వేశాను. 'బెకినీ బిరుగల్లే' సినిమాలో నేను గ్లామర్‌గా కనిపించనున్న మాట నిజం. అయితే... ఎక్కడా వల్గర్‌గా మాత్రం కనిపించను అంది. అలాగే ఇది గ్లామర్ ఫీల్డ్. జనానికి కావాల్సిందే మనం చేయాలి. అంతేకాని మనం చేసేది జనాన్ని చూడమంటే ఇక్కడ కుదరదు. నా నుంచి ప్రేక్షకులు గ్లామర్‌నే ఆశిస్తున్నారు. అలాంటప్పుడు గ్లామర్‌గా కనిపిస్తే తప్పేంటి..అని ప్రశ్నించింది.

    అలాగే తను ఎన్నిసార్లు బికినీ వేసినా బోర్ కొట్టడం లేదని చెపుతూ...నాకు బోర్ కొట్టిందా లేదా అని ఎప్పుడు ఆలోచించను..ప్రేక్షకులకు బోర్ కొట్టకూడదు. వారు నా నుంచి బికినీలో చూడాలని కోరుకుంటున్నారు. అందుకే నేను వేస్తున్నారు. వారు మేము చూడము అని చెప్పిన రోజున నన్ను నిర్మాతలే బికినీ వేయమని అడగరు. నిజం చెప్పాలంటే..ఈ రోజు నేను ఇంత బిజీగా ఉన్నానంటే కారణం ఓ విధంగా బికినీనే. నా తొలి తమిళ చిత్రం 'ఎన్గళ్ అన్నా'లో తొలిసారి బికినీ వేశాను. అదే నా కెరీర్‌కి మేలిమలుపు అయ్యింది. అప్పట్నుంచి కొన్నాళ్లపాటు తమిళ సినీరంగాన్ని ఏలగలిగాను అంది.

    ఇక తెలుగులో బినామీలపై నమిత చేసే పోరాటమే చిత్రం ప్రధాన కథాంశంగా 'శుక్ర'అనే చిత్రం ఆ మధ్య ప్రారంభమైంది.ఈ చిత్రంలో నమిత స్పెషల్ బ్రాంచ్ పోలీసాఫీసర్‌గా కనిపించనుంది. ఇప్పటివరకూ అనేక గ్లామర్ పాత్రలు పోషించిన నమిత స్పెషల్ బ్రాంచ్ పోలీసాఫీసర్‌గా కనిపించటమే స్పెషల్ అనిచెప్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడైన రవివర్మ ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. రాజ్‌సందేశ్, డింపుల్, కోట శ్రీనివాసరావు, మురళీమోహన్ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగణం. ఎస్.ఆర్.పి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అబీబ్ నజీర్, పాలమూరు పాండు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

    English summary
    ‘Benki Birugali’ Kannada film Namitha is Benki (meaning fire) and Saloni is Birugali (wild wind). MM Srilekha has scored the music. Madhu V Naidu is the man behind camera, Rishi and Arun Kumar are also in the cast. According to sources this film is aimed in Kannada, Telugu and Tamil. But the full film has to be in Kannada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X