నేను చెడ్డదాన్నే...ప్లీజ్ నన్ను అసహ్యించుకోవద్దు: నమిత
నేను చెడ్డదాన్నే..దయఉంచి నన్ను అసహ్యించుకోవద్దు..అంటూ వేడుకుంటోంది నమిత. ఆమె తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ...ఈ విషయాలు రాసింది. అయితే ఆ చెడ్డతనమంతా తాను తాజాగా చేస్తున్న చిత్రంలోని పాత్రదని, అది అవుట్ అండ్ అవుట్ వ్యాంప్ క్యారెక్టర్ అనీ, అది చూసి నా నటనను నిజమే అని నమ్మ నిజ జీవితంలోనూ అలాంటిదాన్నే అనుకోవద్దని రిక్వస్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఆమె తాజాగా సురేష్ కృష్ణ(భాషా డైరక్టర్) 50వ చిత్రం ఇలైగనన్ లో ఓ కీలకమైన పాత్ర చేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి రాసిన తాయి కావ్యమ్ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఎస్. మార్టిన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు. బి.ఎల్. సంజయ్ కెమెరా హేండిల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











