నమిత సొంత 'డబ్బా'
మొన్నటికి మొన్న మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా తను వెళ్లకపోవడం వల్లే విశ్వసుందరిగా ఎంపికైందని చెప్పుకున్న నమిత, ఇప్పుడు తనని ఏకంగా అతిలోక సుందరి శ్రీదేవీ తో పోల్చకుంటోంది. ఇంతకీ విషయమేమిటంటే అతిలోక సుందరి శ్రీదేవీ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రంలో దేవకన్యగా నటించి అందరి మెప్పు పొందింది. ఇప్పుడు తనని కూడా అందరూ అతిలోక సుందరిలా ఉన్నానని అంటున్నారని కనిపించిన వారందరికీ చెప్పుకుంటోంది నమిత.
నమిత ఎక్కడ, శ్రీదేవీ ఎక్కడ! నమితని శ్రీదేవీతో పోల్చడం ఏంటీ అనుకొంటున్నారా? అవును మరి నాజూకు సుందరి శ్రీదేవీ ఎక్కడ, బొద్దుగుమ్మ నమిత ఎక్కడ? వినడానికే కాస్త ఇబ్బందిగా వుంది కదూ... కానీ ఇవేవీ పట్టని నమిత మాత్రం తాను 'జగన్మోహిని' చిత్రంలో దేవకన్యగా చాలా బాగున్నానని, అందరూ శ్రీదేవీతో పోల్చుతున్నారంటోంది. సెల్ఫ్ డబ్బా అంటే ఇదే మరి.
namitha jaganmohini raja meera chopra billa prabhas anushka sri devi priyanka chopra నమిత జగన్మోహిని రాజా మీరా చోప్రా శ్రీదేవీ ప్రియాంక చోప్రా బిల్లా ప్రభాస్ అనుష్క


Click it and Unblock the Notifications