ధనుష్ పేరు చెప్పి ఆ నిర్మాత నన్ను మోసం చేశాడు.. నమిత

సొంతం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అందాల భామ నమిత. మొదటి సినిమాతోనే అమ్మడు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసిన నమితకు ఆశించిన విజయాలు దక్కలేదు.

ఇక దీంతో తెలుగు వదిలి తమిళ్ కు వెళ్ళిపోయింది. అక్కడ నమిత అందాలన్ని తమిళ తంబీలు ఫిదా అయిపోయారు. ఏకంగా ఆమెను దేవతను చేసి గుడికట్టి మరీ పూజించారు. ముద్దుగా ఉండే నమిత బొద్దుగా మారింది. అయినా అందాల ఆరబోత మాత్రం తగ్గించలేదు. ఆ అందాలకే కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయారు.

Namitha sensational comments about top producer cheating on her

ఇక హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకొని ఐటెం సాంగ్స్, అడల్ట్ సినిమాలు చేస్తూ అమ్మడు బాగానే సంపాదించింది. కెరీర్ ఒక మోస్తరుకు మారే సమయానికి నమిత పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. 2017 లో తెలుగు డైరెక్టర్ అయిన వీరేంద్ర చౌదరిని వివాహమాడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. పెళ్లి తరువాత నమిత సినిమాలకు దూరమయ్యింది. ఇక రెండేళ్ల క్రితమే ట్విన్స్ కు జన్మనిచ్చి తల్లిగా మారింది.

సినిమాలు మాత్రమేనా అమ్మడు రాజకీయ ప్రవేశం కూడా చేసింది. ఈ మధ్యనే బీజేపీ తరుపున ప్రచారం కూడా చేసింది. వచ్చేఎన్నికల్లో విజయ్ కు పోటీగా నిలబడాలని తెలిపింది. విజయ్ ఎంతో మంచివాడని, రాజకీయంలో సమ ఉజ్జిలతోనే పోటీపడాలని తెలిపింది.ప్రస్తుతం నమిత సినిమాలు చేయడం లేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఇంట్లో పిల్లలను చూసుకుంటూనే.. బుల్లితెరపై పలు షోస్ లలో కనిపిస్తుంది. ఇక అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటుంది.

తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు తన జీవితంలో జరిగిన ఒక చేదు సంఘటనను అభిరామానులతో పంచుకుంది. ఒక పెద్ద నిర్మాత తనను మోసం చేశాడని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చింది. " ఆ సినిమా పేరు నేను చెప్పలేను. కోలీవుడ్ హీరో ధనుష్ సినిమా చేస్తున్నామని ఒక పెద్ద నిర్మాత నా డేట్స్ తీసుకున్నాడు. నేను కూడా ధనుష్ అంటున్నాడని ఇచ్చాను. అప్పుడు నీ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి.

Namitha sensational comments about top producer cheating on her

ఇక షూటింగ్ కు వెళ్లి చూసేసరికి ధనుష్ ప్లేస్ లో నిర్మాత కజిన్ హీరోగా చేశాడు. నేను చాలా బాధపడ్డాను. సినిమా సగంలోనే వచ్చేసాను. కానీ, ఎలాగోలా చివరికి షూటింగ్ ను ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఈ విషయమై దర్శకమండలిలో కూడా ఫిర్యాదు చేశాను. ఇదే కాదు మళయాళంలో కూడా ఇలాంటి అనుభవాలను ఫేస్ చేశాను" అంటూ నమిత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నమిత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక నమిత చెప్పిన ఈ వ్యాఖ్యలను బట్టి సదురు నిర్మాత ఎవరు అని ఆమె అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే నమిత రీఎంట్రీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మంచి పాత్రలు వస్తే తప్పకుండ నటించడానికి రెడీ అని ఆమె తెలిపింది. మరి తెలుగులో నమిత రీఎంట్రీ ఏ స్టార్ హీరో సినిమాలో ఉంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X