చివరకు డ్రెస్ డిజైనర్ తో నమిత ఎఫైర్
నమిత తాజాగా సిడ్నీ సల్డన్ అనే డ్రెస్ డిజైనర్ తో ఎఫైర్ నడుపుతోందంటూ చెన్నై పత్రికలు కోడే కూస్తున్నాయి. ఫ్యాషన్ రంగంలో టాప్ మోస్ట్ డిజైనర్ గా వెల్గుతున్న సిడ్నీ అంటే చాలా మంది హీరోయిన్స్ కు పిచ్చ అభిమానం. అతని పర్మనెంట్ కష్టమర్స్..త్రిష, రమ్యకృష్ణ, శ్రేయ వంటి స్టార్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో నమిత అంటే ఈ మద్యన సిడ్నీ ప్రత్యేక అబిమానం చూపుతున్నాడని చెప్తున్నారు. అతను రెగ్యులర్ గా కండెక్టు చేసే ర్యాంప్ వాక్స్, క్లాక్ ఎగ్జిబీషన్స్ కు నమిత ప్రత్యేకంగా అటెండవుతోంది. అంతేగాక షూటింగ్స్ ని సైతం పోస్ట్ ఫోన్ చేసుకుని సిడ్నీతో పార్టీలలో, పబ్ లలో సెటిలవుతోంది. ఇద్దరూ ఒంటరిగా గంటలు తరబడి గడుపుతున్నారని పేజ్ త్రి సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. అయితే నమిత మాత్రం తమ రిలేషన్ కేవలం ప్రొపిషనల్ అనీ..కొత్త తరహా డ్రెస్ డిజైన్ కోసం అతనితో చర్చించటానికే కలుస్తున్నానంటూ బుకాయిస్తోంది. సిడ్నీ మాత్రం సమాధానం చెప్పకుండా నవ్వుతున్నాడు. దాంతో ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలకు,దర్శకులకు మండిపోతోంది. మరి ఈ ఎఫైర్ ఎక్కడితో ముగుస్తుందో అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నమిత బాలకృష్ణ సరసన సింహా చిత్రంలో చేస్తోంది. అలాగే పూరీ జగన్నాధ్ తాజా చిత్రం గోలీమార్ లో ఓ ఐటం సాంగ్ కమిట్ అయ్యిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











