పాపం అందరిలా నమిత కోరిక తీర్చుకోలేదా?
"నన్ను చూస్తే ఏమనుపిస్తుందో కానీ..ఏ డైరక్టర్ నా దగ్గర లంగాఓణీ,చీర వేసుకొనే పాత్రల ప్రస్తావనే తీసుకురారు. ఎప్పుడూ మోడ్రన్ డ్రస్ లు ..అదీ ఎక్సపోజింగ్ చేస్తూండే చిన్న డ్రస్ లు..అంటూ బాధపడిపోతోంది నమిత. ఆమెకు తాజాగా లంగాఓణిలలో కనిపించాలనే బుద్ది పుట్టింది. ఈ విషయాన్ని ఇటీవల చెన్నైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నమిత చెప్పుకొచ్చింది. అయితే దర్శకులును తప్పు పట్టలేను..వాళ్ళు నన్ను ఏ విధంగా ఊహించి, చూపిస్తే జనానికి నచ్చుతుందో తెలుసు. ఇక 'జగన్మోహిని' షూటింగ్ సమయంలో మీరా చోప్రా లంగాఓణీలో అద్బుతంగా కనిపించింది. అంతకుముందు కొన్ని తమిళ, తెలుగు చిత్రాల్లో కూడా ఈ లంగాఓణీలను హీరోయిన్స్ ధరించటం చూశాను. నాక్కూడా ఆ డ్రస్సు వేసుకుని ఓ సినిమాలో నటించాలని ఉంది. పూర్తి నిడివి పాత్రలో అలా కనిపించాలని ఆశగా ఉంది..ఎవరైనా దర్శక, నిర్మాతలు ఈ విషయం గురించి ఆలోచించరూ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది నమిత. ప్రస్తుతం నమిత బాలకృష్ణతో 'సింహా'లో చేస్తోంది. అలాగే అతి త్వరలో 'మిస్ చింతామణి'గా పోసాని సరసన తన అందచందాలు ఒలకపోయనుంది. ఇక లంగాఓణీల్లో తనను తాను చూసుకోవాలన్న నమిత కోరిక బాగానే ఉంది కానీ ఇంత లావు ఉన్న ఆమె ఆ డ్రస్సులో కనపడితే ఇంకేమైనా ఉందా అంటున్నారు ఆమె అభిమానులు. కాబట్టి ఆమె కోరిక పెద్దది కాకపోయినా తీరే అవకాశం లేదు.


Click it and Unblock the Notifications











