నమిత..అదీ భారీనే
నమిత అందాలే కాదు ఆమె తీసుకునే రెమ్యునేషన్ సైతం భారీగానే ఉంటుంది అంటున్నారు తమిళ టీవి మీడియా వారు. తాజాగా ఆమె విజయ్ ఛానెల్ లో బోయ్స్ వెర్సస్ గర్ల్స్ అనే పోగ్రామ్ కి జడ్జిగా అటెండవుతోంది. శుక్రవారం మరియు శనివారం టెలికాస్ట్ అయ్యే ఈ పోగ్రామ్ నిమిత్తం ఎపిసోడ్ కి ఏడు లక్షలు ఇస్తున్నారు. అలాగే ఈ పోగ్రామ్ పాపులర్ అయితే దాన్ని పదిలక్షలు వరకు పెంచుతారని సమాచారం. ఇక ఇంతకు ముందు ఈ ముద్దుగుమ్మ "Maanadu Mayiladu" అనే పోగ్రామ్ కి కలింగర్ ఛానెల్ కి అటెండ్ అయింది.
అప్పుడు ఆ ఛానెల్ టీఆర్పీలు ఓ రేంజికెళ్ళి పోయాయి. అయితే అకస్మాత్తుగా పెంచిన ఆమె రెమ్యునేషన్ ని వారు తట్టుకోలేమని చేతులు ఎత్తేసారు. అది దృష్టిలో పెట్టుకని ఈ విజయ్ ఛానెల్ వారు ఆమెతో కరెక్టుగా ఎగ్రిమెంట్ రాసుకుని, తర్వాత హఠాత్తుగా పెంచకూడదని కండీషన్ పెట్టే తీసుకున్నారు. సర్లే చెన్నై లో ఉన్నప్పుడు ఓ రెండు గంటలు షూటింగ్ కార్యక్రమం కదా అని సరేనంది. ఆమెతో తమిళ హీరో (ఒకరికొకరు) శ్రీకాంత్ కూడా మరో జడ్జిగా పాల్గొంటున్నాడు. అయితే అతనికి అంత సీన్ లేదు.


Click it and Unblock the Notifications











