నమిత కు మర్చిపోలేని చేదు అనుభవం
హీరోయిన్ అయిన తర్వాత ముఖ్యంగా ఒక సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని అది చేదు అనుభవమని నమిత చెప్పింది. ఆ అనుభవం ఆమె మాటల్లోనే..''ఓ సినిమా షూటింగ్ కోసం నేను మలేసియా వెళ్లాను. సినిమాల్లోకి వచ్చిన కొత్త కాబట్టి నాతో పాటు మా నాన్నగారు కూడా వచ్చారు. అక్కడ పాట షూటింగ్ జరిగింది.పాటలో భాగంగా ఆ రోజు నేను 'లో నెక్ బ్లౌజ్" వేసుకున్నాను. డ్రెస్సింగ్, మేకప్ పూర్తి చేసుకుని గదిలోంచి బయటకు రాగానే మా నాన్నగారు కనిపించారు. దాంతో ఇబ్బందిపడిపోయి ఒక రుమాలుని నా మెడకు చుట్టుకున్నాను. నాన్న కూడా ఇబ్బందిపడ్డారు. 'నువ్వు లొకేషన్‌కి వెళ్లు.. నేను రాను" అని తలదించుకుని వెళ్లిపోయారు. కానీ ఆ రోజు నాన్న నన్ను చూసి బాధపడ్డారు. ఈ సంఘటనను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంది.నమిత ప్రస్తుతం ఎన్టీఆర్,బోయపాటి కాంబినేషన్ లో రూపొందే చిత్రంలో ఐటం సాంగ్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











