twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భ్రూణ హత్యలపై భారీ అందాల నమిత

    By Srikanya
    |

    నేడు మహిళలపై సాగుతున్న ఆకృత్యాలను చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. ముఖ్యంగా భ్రూణ హత్యలయితే మరీ బాధాకరం. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమది. ఇదేమీ సినిమా డైలాగు కాదు నమిత ఈ మధ్య కొత్తగా మొదలు పెట్టిన పాఠం. ఆమె ఈమధ్య మీడియా కనపడితే చాలు ఇలాంటి మాటలు చెప్పుతోంది. దాంతో ఆమెను మీ కొత్త సినిమా గురించి చెప్పండి, మీ సౌందర్య రహస్యాలు చెప్పండి అంతేగానీ ఈ గాంధీజీ సూక్తులు వల్లించకండి మేడం అంటూ మొత్తుకుంటున్నారు. అయితే ఆమె మాత్రం మీరు ఎంతకాదన్నా ఒంటరిగా ఉన్న సమయాల్లో నాతు ఇలాంటి విషయాలు మదిలోకొచ్చి అలజడి రేపుతాయి. భవిష్యత్తులో తప్పకుండా స్త్రీ, శిశు సంక్షేమానికి సంబంధించి ఏదైనా కార్యక్రమం చేస్తాను అంది. చేసేవాళ్ళు గుట్టుగా చేసేస్తారు..ఇలా చెప్పేవాళ్ళే ఏమీ చెయ్యరు అని మొహం మీదే అన్నా నా మనస్సులో ఉన్నది చెప్పాను..అంటూ దాటేసింది. ఆమెకు ఈ మధ్య సీనియర్స్ ని ఆకట్టుకోవాలనే కోరిక పెరిగిందని అందుకే ఏదో సమాజం గురించి నాలుగు ముక్కులు మాట్లాడితే బెటర్ అని ఈ పాట పాడుతోందని అంటున్నారు. చూద్దాం ఇంతకీ నమితవి మాటలేనా...లేక చేష్టలా అన్నది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X