తెలుగువాళ్ళే నన్ను నాశనం చేసారు...నమిత
తనని తెలుగు చిత్ర పరిశ్రమలోని దర్శకులు, నిర్మాతలు మిస్ గైడ్ చేసారని, దాంతో తన కెరీర్ మొత్తం నాశనమయిపోయిందని వాపోయింది. అంతేగాక ఓ ఐటం గర్ల్ పై తనపై ముద్ర వేశారని, అయితే తనకు సెక్స్ బాంబ్ ఇమేజ్ తో కొనసాగటం ఇష్టం లేదని చెప్పింది. అలాగే తాను టాలెంటెడ్ యాక్టర్ నని ప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వివరించింది. అందుకే తనకు సింహా విజయం తర్వాత దాదాపు 14 సినిమా ఆఫర్స్ దాకా వచ్చాయని, అయితే దురదృష్టవశాత్తు అన్నీ వ్యాంప్ తరహా పాత్రలేనని, అందుకే రిజెక్టు చేసానని చెప్పింది. అలాగే తనలోని నటిని వెలికి తీసే పాత్ర లభిస్తేనే తాను తిరిగి తెలుగు ఫీల్డ్ లో అడుగుపెడతానని అంది. ప్రస్తుతం ఆమె ఓ కన్నడ చిత్రం సైన్ చేసింది. ఆ చిత్రం పేరు నమిత...ఐ లవ్ యు అని సమాచారం.


Click it and Unblock the Notifications











