నమితను లైంగికంగా లొంగతీసుకోవటానికి చేసే ప్రయత్నాలు

By Srikanya

నమితను లొంగతీసుకోవాలని రకరకాలుగా చాలా మంది ప్రయత్నింస్తూంటారు. ఆమె చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుని జీవనం సాగిస్తున్న యువతి. అలా లొంగదీసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళలో వీళ్లలో ఓ టీనేజ్ కుర్రాడు కూడా ఉంటాడు అంటూ నిర్మాతలు తాము అందిస్తున్న 'హైస్కూల్ -2' చిత్రం గురించి చెప్పుకొచ్చారు. అలాగే ఆమెకి పెళ్లయిందని, భర్తను పోగొట్టుకుందని తెలిసినా ప్రేమిస్తున్నానంటూ ఆ కుర్రాడు ఆమె వెంట పడుతుంటాడు. ఎవరు ఎంత ప్రలోభపరచాలని చూసినా లొంగకుండా ఉన్నప్పటికీ ఆమె నిందల్ని భరించాల్సి వస్తుంది.

వాటినుంచి ఆమె ఎలా బయటపడిందన్న ఇతివృత్తంతో 'హైస్కూల్ -2' చిత్రం రూపుదిద్దుకుంది. ఈ సినిమాలో జెన్నిఫర్ పాత్రలో నమిత నటించింది. తనకన్నా వయసులో పెద్ద అయిన నమితతో ఓ స్కూల్‌ కుర్రాడు ప్రేమలో పడే ఈ కథతో వచ్చిన 'అళగాన పొన్నుదాన్‌' అనే తమిళ చిత్రం డబ్బింగ్ వెర్షన్ ఇది. 'హైస్కూల్-2' చిత్రం షూటింగ్ పార్ట్ ముగించుకుని ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తారు. కార్తీష్, మైల్ స్వామి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎన్.రమేష్, పాటలు: పొందూరి, సంగీతం: సుందర్ సి.బాబు, నిర్మాత: వెంకట్, దర్శకత్వం: తిరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X