అత్త, అల్లుడు మధ్య సాగే వైరంలో పచ్చి మిరపకాయ్‌గా నమిత
గ్లామర్ తార నమిత ఇటీవల తమిళంలో నటించిన చిత్రం 'సండై". ఈ చిత్రాన్ని తెలుగులో 'పచ్చి మిరపకాయ్" పేరుతో అనువదిస్తున్నారు నిర్మాతలు జి.సోమేశ్వర రెడ్డి, వీఆర్‌ఆర్. శక్తి చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం చెన్నయ్‌లో డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ''తమిళంలో వందరోజులకు పైగా ప్రదర్శింపబడిన ఈ చిత్రం పూర్తి వినోదంతో పాటు యువతను మెప్పించే విధంగా వుంటుంది.
అత్త, అల్లుడు మధ్య సాగే వైరంలో మధ్యలో ఎంటర్ అయ్యే గ్లామరస్ పాత్రను నమిత పోషించారు. అత్తగా నదియా నటించగా, అల్లుడుగా సుందర్ సి.బాబు నటించారు. హీరో భార్యగా రాగిణి నటించగా హీరోలవర్‌గా నమిత నటించారు. దిన సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు వినసొంపుగానే కాకుండా చిత్రీకరణ పరంగా కూడా బాగుంటాయి. వేసవిలో చల్లదనాన్ని పంచే 'పచ్చి మిరపకాయ్"గా ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తాం"" అన్నారు.


Click it and Unblock the Notifications











