'వేదం' తమిళ రీమేక్ లో వేశ్యగా ఆ భారీ హీరోయిన్
తెలుగులో మంచి విజయం సాధించిన 'వేదం' చిత్రం తమిళంలోకి రీమేక్ కాబోతోంది. ఈ రీమేక్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి సొంతం చేసుకున్నారు.ఆయన సొంత పతాకం సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై తమిళ స్టార్ హీరోల కాంబినేషన్ లో తన కుమారుడు జీవా ని ప్రధానంగా పెట్టి చేయనున్నారు. అల్లు అర్జున్ పాత్రను జీవా చేస్తారని, నమిత...అనుష్క చేసే వేశ్య పాత్రకు తీసుకోనున్నారు.అయితే అనుష్క అయితే సరోజ పాత్రకు బాగా న్యాయం చేసిందని ఆమెనే తీసుకోవటం మేలని ఆయన శ్రేయోభిలాషులు కొందరు సూచిస్తున్నారుట. ఇక దర్శకుడుగా ఎవరిని ఎన్నుకుంటారన్నది ఇంకా తేలలేదు. అలాగే ఈ చిత్రం రీమేక్ రైట్స్ భారీ మొత్తం చెల్లించి తీసుకున్నారు. తమిళంలో ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ సాధించనున్నదో చూడాలి. ఇంతకు ముందు కూడా క్రిష్ డైరక్ట్ చేసిన గమ్యం రీమేక్ రైట్స్ బాగా అమ్ముడయ్యాయి.


Click it and Unblock the Notifications











