బుజ్జిదాన్ని విడిచి ఉండలేకపోతున్న సెక్సీ నమిత
సెక్సీ స్టార్ నమిత తాజాగా లక్షలు ఖర్చు పెట్టి ఓ అందమైన కుక్కపిల్లను ఈ మధ్య కొనుగోలు చేసింది. ఖాళీ దొరికినప్పుడల్లా దాంతోనే కాలం గడపటానికి తయారవుతోంది. దాంతో నమితతో కాలం గడుపుదామనుకునేవారికి చిర్రెత్తుకొచ్చి..కుక్కలతో పనేంటి..అని నమితను ముఖం మీదే అడిగేస్తున్నారు. ఇక మరికొందరు అయితే..లక్షలు పోసి కుక్కపిల్లను కొనడం అవసరమా..? అని అడగుతూంటే నమితకు కాలిపోతుందిట. దాంతో నా ఇష్టం...ఎన్ని లక్షలైనా పోస్తాను. అడగడానికి మీరెవరు..? అంటూ కయ్యమంది. అంతేగాక తన న్యూ పెట్ గురించి ఆమె మాట్లాడుతూ.... ఇది నా ఇంట్లోకి అడుగుపెట్టినప్పట్నుంచీ రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. రోజులో ఎక్కువ సమయం దీనితోనే గడుపుతున్నాన్నేను. దాని ముద్దు మొహం చూస్తూ కాలం గడిపేయొచ్చు. అంత అందంగా ఉంటుంది ఈ బుజ్జితల్లి. దాన్ని విడిచి ఉండలేకపోతున్నాను అంటూ తన కుక్కపిల్ల గురించి తెగ ముచ్చట పడిపోతోంది నమిత. సింహాలో బాలకృష్ణ సరసన చేసిన నమితకు ఆ తర్వాత తెలుగులో ఏ ఆఫరూ రాలేదు.


Click it and Unblock the Notifications











