భారీ అందాల నమిత మరో సారి వార్తల్లో కి ఎక్కింది.నమిత కుర్రాళ్ళ హార్ట్ బీట్ అని మరో సారి బుజువయింది. బారత దేశంలోని గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఎక్కువ వెతికే పేరు నమిత అని తేలింది. ఇన్నాళ్ళూ ఆమె ఫొటోల డౌన్ లోడ్స్ కి,ఆమె వీడియోలకు డిమాండ్ ఉందనుకునే వారు ఇది విని షాకయ్యారు. వెబ్ సైట్స్ లో ఆమె గురించి చిన్న వార్తయినా మంచి క్లిక్స్ పడుతున్నాయి. అలాగే ఆమె ఫొటోల గ్యాలరీలు సైతం ఎక్కువ మంది చూస్తున్నారు. ఏ నయనతారో,త్రిషో,ప్రియాంకా చోప్రా,ఇలియానా,అసిన్ ఈ స్ధానం ఆక్రమిస్తారనుకుంటే నమిత అది ఎగురేసుకుపోయింది. ఇంతకు ముందు ఐశ్వర్యారాయి కి నెట్ లో మంచి డిమాండ్ ఉండేది. అది ఇప్పుడు తారు మారు అయింది. దాంతో కుర్రాళ్ళ టేస్ట్ మారిందా అనేది చర్చనీయాంసంగా మారింది.ఇక ఈ విషయం విన్న ఆమె అభిమానుల ఆనందానికి అంతే లేదు. కంగ్రాట్స్ నమిత అంటున్నారు.