twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనూష్కకున్నట్లే నాకూ..నమిత

    By Staff
    |

    భిల్లా చేసినప్పటినుంచీ అనూష్కకు, నమితకూ మధ్య పోటీ ప్రారంభమైంది. ప్రతీదానికి అనూష్కతో పోల్చి చూసుకునే ప్రయత్నం చేస్తోంది నమిత. తాజాగా ఆమె తన జగన్మోహిని చిత్రం గురించి మాట్లాడుతూ అది కూడా భవిష్యత్ లో అనూష్కకున్నట్లే తనకూ ఓ పెద్ద హిట్ ఉండబోతోందంటోంది. తను చేసిన జగన్మోహిని చిత్రం అరుంధతి లాంటి జెనరే కాబట్టి ఆ రేంజ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అంది. అంతేగాక రెండూ సోషియో ఫాంటసీలేనని, రెండు చిత్రాలలోనూ హీరోయిన్ ప్రాధాన్యత కలిగినవేనని, ముఖ్యంగా రెండూ గ్రాఫిక్స్ ప్రాధాన్యత గల చిత్రాలే నని విప్పి చెప్పింది.

    అరుంధతిలా పెద్ద హిట్టు కావాలనే కోరిక తప్పేమీ కాదు కానీ అలాంటి చిత్రమేనని చెప్పటం మాత్రం ఆ దర్శకుడుకి నచ్చటంలేదు. తమ సినిమా వివిధరకాలుగా అలరిస్తుందని, వినోద ప్రధానంగా సాగుతుందని చెప్తున్నాడు. అంతేగాక అరుంధతి పాత్రకు, జగన్మోహినికీ పోలిక లేదంటున్నాడు. ఇలా ఇటు నమిత, అటు ఆ దర్శకుడు వీర పబ్లిసిటీ చేస్తున్నారు. ఇంతకీ హిట్టు మాట తర్వాత సంగతి సినిమా ప్రారంభమయ్యి చాలా కాలం అయ్యింది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటున్నారు ఆమె అభిమానులు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X