ఇక నమితకు పెళ్ళెందుకు?

అయితే నమిత మాత్రం మూతిని సున్నాలా చేసి బాలివుడ్ స్టార్ హీరోయిన్ సుస్మితాసేన్ మాదిరిగానే తాను ఓ పాపను దత్తత చేసుకుంటున్నాను తప్పేముంది అంటోంది. అది సరే సుస్మిత ఎడాప్ట్ చేసుకున్న అమ్మాయి ఆమె కూతురే అని అంటూంటూరు కదా. నీ కథ కూడా అలాంటిదేనా అని కొందరు వెటకారంగా అడిగారుట.అంతేగాక సుస్మిత పెళ్ళి పెడాకులు లేకుండా ప్రశాంతంగా మరో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖే ఆదర్శమంటూ ఆనందంగా జీవిస్తోంది. అలాగే నమిత కూడా సుస్మిత ఆదర్శమంటోంది..అంటే ఆమెకి కూడా పెళ్ళెందుకనిపిస్తోందేమో...అయినా ఆ లోటు తీర్చకోవటానికేనేమో పిల్లను కూడా దత్తత తెచ్చుకుంటోంది అంటున్నారు. అయితే ఏదో సాగితే..పెళ్ళెందుకున్నారుకదా అని వెనుక తమిళ తమ్ముళ్ళు గుసగుసలాడుతున్నారు.


Click it and Unblock the Notifications











