వెంకటేష్ లాంటి మొగడు కావాలంటున్న 'సింహా' హీరోయిన్
'చంటి' సినిమాలో వెంకటేష్ నాకు బాగా నచ్చారు. ఆ సినిమా చూడగానే నాకు వెంకటేష్ లాంటి వ్యక్తి భర్తగా వస్తే బాగుణ్ను అనుకునేదాన్ని అంటోంది భారీ అందాల నమిత. తనకు ఎలాంటి భర్త కావాలో చెబుతూ...నేను అప్పట్లో వెంకటేష్ కావాలని ఆ మాటే మా అమ్మమ్మకు చెప్పాను. కాకతాళీయంగా నేను హీరోయిన్ గా మారిన తర్వాత 'జెమిని' సినిమాలోఆయన సరసన హీరోయిన్ గా చేయడం ఎంతో ఆనందానిచ్చింది ఆ సినిమా టైంలో అమ్మమ్మ నాకా విషయాన్ని గుర్తుచేసింది. భలే సరదాగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది నమిత. ఇక నమిత రీసెంట్ గా బాలకృష్ణ హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన 'సింహా' చిత్రంలో చేసింది. ప్రస్తుతం తమిళంలో ఓ రెండు చిత్రాలు చేస్తోంది. మరో ప్రక్క ఆమె నిర్మాతగా మారి సినిమాలు చేయటానికి సన్నాహాలు చేసుకుంటోంది.
వెంకటేష్ నమిత సింహా బోయపాటి శ్రీను నయనతార స్నేహా ఉల్లాల్ namitha venkatesh boyapati srinu nayantara sneha ullal balakrishana simha


Click it and Unblock the Notifications