రజినీకాంత్ ఈ మాట మరే నటుడికి చెప్పి ఉండరేమో..నేను ఒప్పుకోలేదు!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కాలా. ఈ చిత్రంలో రజినీకాంత్ డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఎక్కువభాగం ముంబైలో జరిగింది. కబాలి ఫేమ్ రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రంలో విలన్ పాత్రలో విలక్షణ నటుడు నానా పటేకర్ మెరిశారు. నానా పటేకర్ పాత్ర గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మొదట కాలా చిత్రంలో నటించడానికి తాను అంగీకరించలేదని నానా పటేకర్ ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు. కానీ రజినీకాంత్ స్వయంగా కథ వివరించి ఓ మాట అన్నారు. ఈ చిత్రమో నన్ను ఎవ్వరూ చూడరు అని రజినీకాంత్ అన్నారు. అది ఆయన మంచితనం అని నానా పాటేకర్ తెలిపాడు.

ఆ తరువాత తాను ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించానని ఆయన తెలిపారు. నానా పటేకర్ తో రజిని అన్న మాట మరే నటుడితోనూ ఆయన అని ఉండరు. ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన హ్యూమా క్యురేషి, ఈశ్వరి రావు హీరోయిన్లుగా నటించారు. రజిని అల్లుడు ధనుష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ఏప్రిల్ 27 న కాలా చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











