twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాలుగు రోజులకి 57కోట్లు కలెక్షన్ రికార్డు

    By Srikanya
    |

    త్రి ఇడియట్స్ రీమేక్ గా శంకర్ దర్సకత్వంలో వచ్చిన చిత్రం నన్బన్. విజయ్, ఇలియానా కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా తమిళనాడులో దుమ్మురేపుతోంది. విడుదల అయిన ఈ నాలుగు రోజుల్లో 57 కోట్లు కలెక్టు చేసిందని అక్కడ మీడియాతో చెప్తోంది. ఇది రికార్డుల పరంగా బ్రేకింగ్ అని అంటున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ని దిల్ రాజు తీసుకున్నారు. ఈ చిత్రానికి తెలుగులో స్నేహితుడు అనే టైటిల్ ని ఫైలైజ్ చేసి విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఆయన భారీ మొత్తమే వెచ్చించినట్లు తెలుస్తోంది. ఇలియానాకు తెలుగులో ఉన్న మార్కెట్ తో పాటు,అపజయమెరగని శంకర్ దర్సకత్వం కూడా ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో హీరోలైన విజయ్,శ్రీకాంత్,జీవాలకు తెలుగులో మార్కెట్ లేదు. రంగంతో జీవా కొద్దిగా పేరు తెచ్చుకున్నా అతని ఇండిడ్యువల్ గా ఇక్కడ మార్కెట్ లేదు. దానికి తోడు హైదరాబాద్ వంటి అర్బన్ ప్రాంతాల్లో త్రీ ఇడియట్స్ చిత్రం చాలా మంది చూసేసారు.

    అయినా దిల్ రాజు పెట్టుబడి పెట్టడానికి కారణం ఇలియానా మీద బెట్ లాంటిదే అంటున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి అనంతరం అంటే జనవరి 26,2012 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో 'నాన్బన్'టైటిల్ తో విడుదల చేస్తున్నారు. ఇక ఇలియానా ఈ చిత్రం గురించి చెపుతూ.. త్రీ ఇడియట్స్ చిత్రానికి శంకర్ చాలా మార్పు చేర్సులు చేశాడని చెబుతోంది. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ చిత్రాన్ని ఆయన మార్చాడని అంటోంది. అలాగే తన పాత్రని గెటప్ ని కూడా కొత్తగా తీర్చి దిద్దాడని వివరించింది. ఈ చిత్రంలో తన పాత్ర పరిధి పెంచారని, కచ్చితంగా ఈ సినిమా తనకి పెద్ద ప్లస్ అవుతుందని చెబుతోంది. అంతే కాక ఈ సినిమాలో తాను నాలుగో ఇడియట్ నని అంటోంది.

    English summary
    Vijay’s Nanban which is getting rave reviews from all sides and breaking record collections.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X