‘వారసుడు’ సినిమాతో మోసం.. నన్ను చివరికి అలా చేశారు.. నటి ఆవేదన
తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు కోసం ఎదురు చూస్తోంది యంగ్ బ్యూటీ నందిని రాయ్. ఇప్పటికే టెలివిజన్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ వెండితెరపై వెలుగొందాలని బాగా ప్రయత్నం చేస్తోంది. అయితే తను చేసే ప్రతి ప్రాజెక్ట్ ను ఎంతో ఛాలెంజింగ్ తీసుకుంటోంది. తన పాత్రల ద్వారా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గర కావాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తనకు జరిగిన ఒక చేధు అనుభవాన్ని గురించి కూడా తాజా ఇంటర్వ్యూలో బయట పెట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..
నందిని రాయ్ ఆసక్తికర విషయాలు..
నందిని రాయ్ అసలు పేరు నీలమ్ గౌరాణి. సికింద్రాబాద్ లో పుట్టి పెరిగింది. 2005 వరకు తన గ్యాడ్యుయేషన్ ను హైదరాబాద్ లోనే పూర్తి చేసుకుంది. ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లండన్ కు వెళ్లింది. తిరిగి వచ్చాక మోడలింగ్, యాక్టింగ్ పై ఫోకస్ పెట్టింది. 2010లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ టైటిల్ ను కూడా గెలుచుకుంది. అక్కడి నుంచి ఆమెకు టెలివిజన్, సినీ రంగాల్లో అవకాశాలు కూడా అందడం ప్రారంభం అయ్యాయి.

నందిని రాయ్ సినిమా వివరాలు..
యంగ్ బ్యూటీ నందిని రాయ్ 2011 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా కనిపిస్తోంది. తొలుత హిందీలో 'ఫ్యామిలీ ప్యాక్' అనే చిత్రంలో మెరిసింది. ఇక తెలుగులో 040, హర్మోన్స్, మాయ, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజనీతో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి - రష్మిక మందన్న నటించిన 'వరిసు' చిత్రంలో స్మిత అనే పాత్రలో నటించింది. ఈ చిత్రం తర్వాత ఇంకాస్తా మంచి గుర్తింపు దక్కించుకుంది.
వారసుడు సినిమా తర్వాత..
నందిని రాయ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను ఎందుకని 'వారసుడు' చిత్రంలో నటించానా అని ప్రశ్చాత్తాపం చెందినట్టు చెప్పింది. ఎందుకని ప్రశ్నించగా.. అసలు తన పాత్రకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని, మొదట ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పి చివరి అసలు ఎందుకు నా పాత్రను క్రియేట్ చేశారా? అని అనిపించేలా చేశారని వాపోయింది. విజయ్ దళపతి చాలా సీన్లు ఉండాల్సి ఉండిందని, ప్రకాశ్ రాజ్ తోనూ కీలకమైన సన్నివేశాలు ఉండాల్సి ఉందని, కానీ చివరకు నిరాశే మిగిలిందని, తన పాత్ర పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు చెప్పింది. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట హాట్ టాపిక్ గ్గా మారాయి.
టెలివిజన్ రంగంలో నందిని రాయ్ క్రేజ్..
టీవీ ప్రేక్షకుల్లో నందిని రాయ్ కి మంచి క్రేజ్ ఉండింది. 2018లో వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 2కు కంటెస్టెంట్ గా ఎంపికై బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. ఆ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హై ప్రైజెస్ట్స్, షూట్ అవుట్ ఎట్ అలేర్, మెట్రో కథలు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, గాలివాన వంటి సిరీస్ లతోనూ విభిన్న పాత్రల ద్వారా టెలివిజన్, ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.


Click it and Unblock the Notifications











