మారిపోయిన నాని కొత్త సినిమా టైటిల్.. సరిపోదా శనివారం పేరును ఏమని మార్చారంటే!

టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే తమదైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. అందులోనూ కొందరు హీరోలు సహజసిద్ధమైన యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న అతడు.. ఇప్పుడు 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేస్తున్నాడు.

గత ఏడాది 'దసరా', 'హాయ్ నాన్న' వంటి హిట్లను అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నాని.. ఇప్పుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. 'అంటే సుందరానికీ' మూవీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడగా.. అందుకు తగ్గట్లే దీన్ని తీస్తున్నారు.

Nani Starrer Saripodha Sanivaaram Movie Title Changed For Other Languages

వివేక్ ఆత్రేయ - నాని కలయికలో విభిన్నమైన స్టోరీలైన్‌తో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే మొదలైంది. అప్పటి నుంచి ఇది శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్టును చిత్ర యూనిట్ కంప్లీట్ చేసింది. అలాగే, మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్లు చేసుకుంటూ వెళ్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న 'సరిపోదా శనివారం' మూవీ నుంచి ఇటీవలే గ్లింప్స్ వీడియో విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. దీనికితోడు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేస్తుండడంతో అన్ని ఏరియాల్లోనూ హైప్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నాని నటిస్తోన్న ఈ క్రేజీ సినిమా టైటిల్‌ను మార్పు చేశారు.

నాని హీరోగా నటిస్తున్న 'సరిపోదా శనివారం' మూవీని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో కూడా రూపొందిస్తున్నారు. ఇప్పుడు ఆయా భాషల్లో మాత్రం ఈ సినిమా పేరును 'సూర్య శనివారం' (Surya's Saturday)గా మార్చారు. ఒక్క తెలుగులో మాత్రమే 'సరిపోదా శనివారం' అని ఉంచుతున్నారు. దీంతో ఈ చిత్రం మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఎస్‌జే సూర్య విలన్ పాత్రను చేస్తున్నారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

More from Filmibeat

Read more about: nani saripodha sanivaaram
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X