నాని కొత్త చిత్రంలో అమలాపాల్ ఎంపిక
తెలుగు, తమిళ భాషల్లో చిత్రం చేయాలనుకున్నవారికి నానినే స్టార్ హీరోలా కనపడుతున్నారు. ముఖ్యంగ డైరక్ట్రర్ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలనే ఆసక్తి ఉన్నవారు నానితో జర్ని పెట్టుకుంటున్నారు. తాజాగా నాని ..తమిళ దర్శకుడు సముద్ర ఖని దర్సకత్వంలో ఓ చిత్రం కమిటయ్యారు. తమిళ,తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రంలో నాని సరసన అమలా పాల్ ని ఎంపిక చేసారు.
ఇక నాని ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం తో కనిపించనున్నారు. తమిళ వెర్షన్ కు గానూ జయం రవి హీరోగా చేస్తున్నారు. సముద్రఖని గతంలో తెలుగులో 'శంభో శివ శంభో' చిత్రాన్ని రూపొందించారు. అలాగే గతేడాది వచ్చిన నరేష్ సినిమా 'సంఘర్షణ' చిత్రానికీ ఆయనే దర్శకుడు. తాజా చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్తుంది. జి.వి.ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తారు. ద్వి పాత్రాభినయం లో నాని చేసే రెండు పాత్రలూ పూర్తిగా విభిన్నమైనవి అంటున్నారు.
ప్రస్తుతం నాని చేసిన తెలుగు,తమిళ చిత్రం ఈగ విడుదలకు రెడీగా ఉంది. సమంత హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని రాజమౌళి డైరక్ట్ చేసారు. ఈ చిత్రం గురించి రాజమౌళి మాట్లాడుతూ..చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలంటారు. కానీ ఇక్కడ సమస్య వచ్చింది ఈగతో. అందుకే ఆ కర్ర కూడా అవసరం లేదు. రెండు వేళ్లమధ్య నలిపేసి అవతల పారేస్తే సరిపోతుంది. అతను కూడా అచ్చం అలానే అనుకొన్నాడు. అరచేత్తో పోయేదానికి ఆయుధం, మందీ మార్బలం అవసరం అవుతుందని కల్లో కూడా అనుకోలేదు. ఈగే కదా అని మనిషి అనుకొంటే ఏమవుతుందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు.
రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం 'ఈగ'. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. సాయి కొర్రపాటి నిర్మాత. ఈ నెల 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ''అల్పప్రాణికి, బలవంతుడైన మనిషికీ జరిగిన పోరాటమిది. కథానాయకుడి ఆత్మ ఈగలో ప్రవేశిస్తుంది. విలన్ అరాచకానికి అడ్డుపడుతూ ఉంటుంది. అదెలాగో తెరపై చూస్తేనే తెలుస్తుంది. క్లైమాక్స్ సీన్స్ అలరిస్తాయి''అన్నారు.


Click it and Unblock the Notifications











