సూర్యా దేవీ, కస్తూరే అంతటికి కారణం.. మధ్యలో వచ్చే వాళ్లు ఫూల్స్... వనిత సంచలన ట్వీట్స్

వనిత విజయ్ కుమార్-పీటర్ పాల్ వివాహంలో చెలరేగిన వివాదం ఎంతకీ తగ్గడం లేదు. రోజురోజుకు మరింత జటిలంగా మారుతోంది. రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. పీటర్ పాల్ తన భార్య ఎలిజబెత్ హెలెన్‌కు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకోవడం ఈ సమస్య మరింత వివాదంగా మారింది. ఇక వీరి వ్యక్తిగత జీవితాలపై సూర్యాదేవీ, కస్తూరీ శంకర్, రవీంద్రన్, నంజిల్ విజయన్ వంటివారు స్పందించారు. అందరూ కూడా వనితనే తప్పుబట్టారు. వీరందరిపై వనిత కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

 సూర్యాదేవీ అరెస్ట్..

సూర్యాదేవీ అరెస్ట్..

యూట్యూబ్ చానెల్, మీడియాలో తనపై అసభ్య కరపదజాలంతో దాడి చేస్తున్నారని వారందరిపై వనిత ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే అర్దరాత్రి సూర్యాదేవీని అరెస్ట్ చేశారు. అయితే కస్తూరీ శంకర్ మాత్రం వెంటనే బెయిల్ మీద ఆమెను విడిపించింది. ఇదిలా ఉండగా వనిత ఈ మధ్య నంజిల్ విజయన్, సూర్యా దేవీ సన్నిహితంగా ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది.

 బదులు తీర్చుకుంది..

బదులు తీర్చుకుంది..

గత కొన్ని రోజుల క్రితం వనిత తన స్నేహితుడితో ఉన్న ప్రైవేట్ ఫోటోను కొందరు లీక్ చేశారు. దానికి బదులుగా వనిత తాజాగా నంజిల్, సూర్యాదేవీ ఫోటోను బయట పెట్టింది. ఆ ఫోటో తెగ వైరల్ కావడంతో నంజిల్ దిగొచ్చినట్టు, ఆమెకు సారీ చెప్పినట్టు వనిత వరుసగా ట్వీట్లు చేసింది.

క్షమాపణలు చెప్పాడు..

క్షమాపణలు చెప్పాడు..

నంజిల్ విజయన్ ఫోన్ చేశాడు.. క్షమాపణలు కూడా చెప్పాడు. మొదటి నుంచి మా ఇద్దరి మధ్య జరిగిన వాటి గురించి మాట్లాడాడు. అతను నాకు వ్యతిరేకం కాదు.. మేమిద్దరం ఎప్పుడూ ఎదరుపడలేదు.. మా ఇద్దరికీ పరిచయం కూడా లేదు. ఈ గొడవలు రావడానికి సూర్యా దేవీయే అసలు కారణం.. అతన్ని మధ్యలోకి లాగి ఇదంగా చేసింది కస్తూరీయే.

పరిస్థతిని అర్థం చేసుకున్నాను..

పరిస్థతిని అర్థం చేసుకున్నాను..

అతని యూట్యూబ్ చానెల్‌లో నా గురించి పెట్టిన వీడియోల పట్ల చింతించాడు. అతనికి సంబంధం లేని కేసులో అతనిపై ఫిర్యాదు చేసినందుకు చాలా బాధపడినట్టు వివరించాడు. మధ్యలో అతన్ని లాగి అందరూ ఆట ఆడారు. నేను కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నాను.

అతన్ని మన్నించాను..

అతన్ని మన్నించాను..

అతన్ని మన్నించాను. అసలే ఎదగాల్సిన యువ నటుడు, అలాంటివాడికి ఇలాంటి కాంట్రవర్సీలు అవసరం లేదని నాకు అనిపించింది. ఒక వేళ అతను అమాయకుడైతే, అతనిపై నిందలు వచ్చినందుకు నేను కూడా చాలా బాధపడుతున్నాను.

ఎవరిది వారే..

ఎవరిది వారే..

అతను నాపై చేసిన వీడియోలు, మాట్లాడిన మాటల పట్ల కోపంగా ఉన్నానని చెప్పాను. వాటిని తొలగిస్తానని కూడా మాటిచ్చాడు. మరో వీడియో అంతా క్లారిటీగా చెబుతానని అన్నాడు. ఇద్దరి వ్యక్తుల మధ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే వారే నేరుగా చూసుకోవాలని ఈ ఘటనే చెబుతోంది. మధ్యలో ఎవరైనా వస్తే పరిస్థితి చేజారి పోతుంది.

Recommended Video

Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
మధ్యలో వాళ్లే ఫూల్స్

మధ్యలో వాళ్లే ఫూల్స్

ఎదుటి వారి జీవితాల్లోకి తొంగి చూడటం మానేయండి.. ఎవరి సమస్యను వారు పరిష్కరించుకోగలరు. లాయర్, జడ్జ్‌లా మారి ఉన్న సమస్యను పెద్దది చేయకండి. చివరగా వారిది వారే పరిష్కరించుకుంటారు. మధ్యలో వచ్చిన వాడే ఫూల్ అవుతారు. ఎవరి పని వారు చూసుకుంటే మంచింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X