twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వనిత విజయ్ కుమార్ నోరు అంత పెద్దదా?.. నోటికి తాళం వేసేందుకే.. నటుడి ట్వీట్ వైరల్

    |

    వనిత విజయ్ కుమార్ నోరు ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఇతర కంటెస్టెంట్ల మీద అంత ఎత్తున లేచేది. వనిత ధాటికి ఎవ్వరూ నిలబడేవారే కాదు. ఇక బిగ్ బాస్ షోలోనే అలా అనుకుంటూ బయట కూడా వనిత శివాలెత్తుతుంది. మూడో పెళ్లి వ్యవహారంపై రోజుకో రకమైన చర్చ నడుస్తోంది. పీటర్ తన మొదటి భార్య ఎలిజబెత్‌కు విడాకులు ఇవ్వకుండానే వనితను చేసుకోవడంతో వివాదం మొదలైంది. ఈ గొడవలో నిర్మాత రవీంద్రన్, కస్తూరీ శంకర్, సూర్యా దేవీ, లక్ష్మీ రామకృష్ణన్, నంజిల్ విజయన్ వంటి వారు ఎంటరయ్యారు.

    అందరూ వనితపై ఫైర్..

    అందరూ వనితపై ఫైర్..

    మూడో పెళ్లి వ్యవహారంలో అందరూ వనితనే తప్పుబట్టారు. యూట్యూబ్ చానెల్, మీడియాలో వనితను అందరూ ఏకిపారేశారు. అలా తనపై అసభ్య కరపదజాలంతో దాడి చేస్తున్నారని వారందరిపై వనిత ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సూర్యాదేవీని అరెస్ట్ చేయగా.. కస్తూరీ శంకర్ మాత్రం వెంటనే బెయిల్ మీద ఆమెను విడిపించింది.

    ప్రవేట్ ఫోటోలతో దాడి..

    ప్రవేట్ ఫోటోలతో దాడి..

    ఆ మధ్య వనిత తన స్నేహితుడితో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోను కొందరు లీక్ చేశారు. దానికి బదులుగా వనిత తాజాగా నంజిల్, సూర్యాదేవీ ఫోటోను బయట పెట్టింది. ఇలా ఒకరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను మరొకరు బహిర్గత పర్చుకుంటున్నారు. ఇలా ఉండగా నంజిల్ విజయన్ తనకు క్షమాపణలు చెప్పాడని వనిత వరుస ట్వీట్లతో దాడి చేసింది.

    క్షమాపణలు చెప్పాడు..

    క్షమాపణలు చెప్పాడు..

    నంజిల్ విజయన్ ఫోన్ చేశాడని, క్షమాపణలు కూడా చెప్పాడని వనిత పేర్కొంది. మొదటి నుంచి తమ ఇద్దరి మధ్య జరిగిన వాటి గురించి మాట్లాడాడని, అతని తప్పేమీ లేదని గ్రహించానని, అయితే తనను తిట్టిన వీడియోలను తొలగించమని తెలిపినట్టుగా పేర్కొంది. ఇక ఈ మేరకు వనిత చేసిన ట్వీట్లకు నంజిల్ స్పందించాడు.

    క్షమాపణలు చెప్పనేలేదు..

    క్షమాపణలు చెప్పనేలేదు..

    తాను వనితకు ఫోన్ చేశానని, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడనని, క్షమాపణలు చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆమె అలా అనుకుని పొరబడినట్టుందని నంజిల్ విజయన్ ట్వీట్ చేశాడు. అది సరిపోనట్టుగా మరో ట్వీటై వేశాడు. ఈ సారి కాస్త సెటైరికల్‌గా స్పందించాడు.

    Recommended Video

    Ala Vaikunthapurramuloo Bollywood Remake,Star Hero Showing Intrest!
    ఓ పెద్ద తాళం..

    ఓ పెద్ద తాళం..

    తాను ఓ పెద్ద తాళం కొన్నానని, అది ఏ సెలెబ్రెటీ కోసమని అనుకుంటారు? ఏమైనా గెస్ చేయండి? అంటూ నంజిల్ విజయన్ ఓ సెటైర్ వేశాడు. అయితే దీనికి భిన్నంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. కస్తూరీ కోసమా, సూర్యాదేవీ కోసమా లేదా నీ కోసమా? అని కొందరు అంటుంటే.. వనితా విజయ్ కుమార్ కోసమే అయి ఉంటుందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.

    English summary
    Nanjil Vijayan Buys A Big Lock For A Celebraty. I have purchased a new lock for a very Important celebrity any guesses?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X