Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వనిత విజయ్ కుమార్ నోరు అంత పెద్దదా?.. నోటికి తాళం వేసేందుకే.. నటుడి ట్వీట్ వైరల్
వనిత విజయ్ కుమార్ నోరు ఎంత పెద్దగా ఉంటుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో ఇతర కంటెస్టెంట్ల మీద అంత ఎత్తున లేచేది. వనిత ధాటికి ఎవ్వరూ నిలబడేవారే కాదు. ఇక బిగ్ బాస్ షోలోనే అలా అనుకుంటూ బయట కూడా వనిత శివాలెత్తుతుంది. మూడో పెళ్లి వ్యవహారంపై రోజుకో రకమైన చర్చ నడుస్తోంది. పీటర్ తన మొదటి భార్య ఎలిజబెత్‌కు విడాకులు ఇవ్వకుండానే వనితను చేసుకోవడంతో వివాదం మొదలైంది. ఈ గొడవలో నిర్మాత రవీంద్రన్, కస్తూరీ శంకర్, సూర్యా దేవీ, లక్ష్మీ రామకృష్ణన్, నంజిల్ విజయన్ వంటి వారు ఎంటరయ్యారు.
అందరూ వనితపై ఫైర్..
మూడో పెళ్లి వ్యవహారంలో అందరూ వనితనే తప్పుబట్టారు. యూట్యూబ్ చానెల్, మీడియాలో వనితను అందరూ ఏకిపారేశారు. అలా తనపై అసభ్య కరపదజాలంతో దాడి చేస్తున్నారని వారందరిపై వనిత ఫిర్యాదు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సూర్యాదేవీని అరెస్ట్ చేయగా.. కస్తూరీ శంకర్ మాత్రం వెంటనే బెయిల్ మీద ఆమెను విడిపించింది.
ప్రవేట్ ఫోటోలతో దాడి..
ఆ మధ్య వనిత తన స్నేహితుడితో సన్నిహితంగా ఉన్న ప్రైవేట్ ఫోటోను కొందరు లీక్ చేశారు. దానికి బదులుగా వనిత తాజాగా నంజిల్, సూర్యాదేవీ ఫోటోను బయట పెట్టింది. ఇలా ఒకరికి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలను మరొకరు బహిర్గత పర్చుకుంటున్నారు. ఇలా ఉండగా నంజిల్ విజయన్ తనకు క్షమాపణలు చెప్పాడని వనిత వరుస ట్వీట్లతో దాడి చేసింది.
క్షమాపణలు చెప్పాడు..
నంజిల్ విజయన్ ఫోన్ చేశాడని, క్షమాపణలు కూడా చెప్పాడని వనిత పేర్కొంది. మొదటి నుంచి తమ ఇద్దరి మధ్య జరిగిన వాటి గురించి మాట్లాడాడని, అతని తప్పేమీ లేదని గ్రహించానని, అయితే తనను తిట్టిన వీడియోలను తొలగించమని తెలిపినట్టుగా పేర్కొంది. ఇక ఈ మేరకు వనిత చేసిన ట్వీట్లకు నంజిల్ స్పందించాడు.
క్షమాపణలు చెప్పనేలేదు..
తాను వనితకు ఫోన్ చేశానని, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి మాట్లాడనని, క్షమాపణలు చెప్పలేదని క్లారిటీ ఇచ్చాడు. ఆమె అలా అనుకుని పొరబడినట్టుందని నంజిల్ విజయన్ ట్వీట్ చేశాడు. అది సరిపోనట్టుగా మరో ట్వీటై వేశాడు. ఈ సారి కాస్త సెటైరికల్‌గా స్పందించాడు.
Recommended Video
ఓ పెద్ద తాళం..
తాను ఓ పెద్ద తాళం కొన్నానని, అది ఏ సెలెబ్రెటీ కోసమని అనుకుంటారు? ఏమైనా గెస్ చేయండి? అంటూ నంజిల్ విజయన్ ఓ సెటైర్ వేశాడు. అయితే దీనికి భిన్నంగా కామెంట్లు వినిపిస్తున్నాయి. కస్తూరీ కోసమా, సూర్యాదేవీ కోసమా లేదా నీ కోసమా? అని కొందరు అంటుంటే.. వనితా విజయ్ కుమార్ కోసమే అయి ఉంటుందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు.