పీకలదాకా తాగి బిగ్‌బాస్‌లోకి.. వీడియోలు రిలీజ్ చేస్తా.. వనితా విజయ్‌కుమార్‌పై కమెడియన్ ఫైర్

తమిళనాడులో వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి తర్వాత వివాదం ఎడతెగని టెలివిజన్ సీరియల్‌లా సాగుతున్నది. పలువురు యాక్టర్లు, యూట్యూబర్ సూర్యాదేవి, కమెడియన్ నాంజిల్ విజయన్, నిర్మాత రవిందర్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకొన్నది. జూలై 14 తేదీన తనపై చేస్తున్న దుష్ర్పచారం చేస్తున్నారని చెన్నైలోని పోరూర్ పోలీసు స్టేషన్ వనితా విజయ్ కుమార్ చేసిన ఫిర్యాదు, మీడియా సమావేశంలో తనపై చేసిన ఆరోపణలపై కమెడియన్ నాంజిల్ విజయన్ సీరియస్ అయ్యారు. ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

 నాపై తప్పుడు ఆరోపణలు

నాపై తప్పుడు ఆరోపణలు

పోరూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత వనితా మీడియాతో మాట్లాడుతూ నాపై అవాస్తవాలు మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేశారు. ఆమె చెప్పిన విషయాల్లో ఒక్కటి విషయాలు కూడా కరెక్ట్ కాదు. నాకు సూర్యాదేవికి రిలేషన్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. నాకు సూర్యాదేవికి ఏఢేళ్ల క్రితం పరిచయం ఉంది. ఆ తర్వాత చాలా రోజుల నుంచి మేము మాట్లాడుకోవడం లేదు అని నాంజిల్ విజయన్ అన్నారు

సూర్యాదేవితో నాకు సంబంధాలు లేవు

సూర్యాదేవితో నాకు సంబంధాలు లేవు

వనితా విజయ్ కుమార్‌పై సూర్యాదేవి వీడియోలు చేసిన యూట్యూబ్‌లో పెడితే సరికాదు అని సూర్యాదేవికి సర్ధి చెప్పే ప్రయత్నం చేశాను. కానీ సూర్యాదేవి వినకపోవడంతో నాకు సంబంధం లేదని నేను వదిలేశాను. ఈ వివాదంలో దూరకూడదని నిర్ణయించుకొన్నాను. కానీ వనితా విజయ్ కుమార్ లాయర్ నన్ను ఈ వివాదంలోకి లాగారు అని నాంజిల్ విజయన్ తెలిపారు.

వివాదంలో తలదూర్చకూడదనే

వివాదంలో తలదూర్చకూడదనే

సూర్యాదేవికి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆమెకు ఎలాంటి అక్రమ దందాలు ఉన్నాయో తెలియదు. నాకు ఆమెకు ఓ విషయం మీద అభిప్రాయబేధాలు వస్తే అప్పటి నుంచి మాట్లాడటం లేదు. ఆమెకు నాకు సంబంధం అంటగడుతూ లాయర్ తప్పుడు ఆరోపణలు చేశారు. ఈ వివాదంలో తలదూర్చకూడదని నేను మౌనంగా ఉన్నాను. ఆరోపణలు చేయాలంటే నా వద్ద చాలా విషయాలు ఉన్నాయి. ఈ వివాదాన్ని మరింత పెంచడం నాకు ఇష్టం లేదు అని నాంజిల్ అన్నారు.

 టిక్ టాక్, యూట్యూబ్ వీడియోలతో ఆరోపణలా?

టిక్ టాక్, యూట్యూబ్ వీడియోలతో ఆరోపణలా?

సూర్యాదేవితో ఎప్పుడో చేసిన టిక్ టాక్ వీడియోను మీడియా ముందు చూపి లాయర్ మరో తప్పు చేశారు. నేను చాలా మంది సెలబ్రిటీలతో టిక్‌టాక్ వీడియోలు చేశాను. అలా అందరితో రిలేషన్ ఉన్నట్టా? యూట్యూబ్, టిక్ టాక్‌లో వీడియోలు తీసి ఇలా అసత్య ఆరోపణలు చేయడం మంచిది కాదు. నా వద్ద కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి పుల్‌స్టాప్ పెడితే వీడియోలు రిలీజ్ చేస్తా అని నాంజిల్ విజయన్ ఫైర్ అయ్యారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
ఫుల్లుగా తాగి వనితా బిగ్‌బాస్‌లోకి

ఫుల్లుగా తాగి వనితా బిగ్‌బాస్‌లోకి

ఇక వనితా విజయ్ కుమార్ విషయాలు నాకు తెలుసు. మహిళ అనే కారణంతో వదిలేస్తున్నాను. కానీ ఆమె నన్ను టార్గెట్ చేయడం చూస్తే నా వద్ద ఆమెకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. ఆమె బిగ్‌బాస్‌లోకి రెండోసారి ఎంట్రీ ఇచ్చేటప్పుడు కార్‌వాన్‌లో ఫుల్లుగా తాగి హౌస్‌లోకి ప్రవేశించింది. అది అందరికీ తెలుసు. నేను సెలబ్రిటీని అంటూ ముద్ర వేసుకొంటూ ఇతరులపై ఆరోపణలు చేయడం సబబా అని నాంజిల్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X