సెన్సార్ కట్స్ లేని‘నాన్న’కు మళ్ళీ క్రేజ్ వస్తుందా..!?
తెలుగులో 'శివపుత్రడు", అపరిచితుడు" తప్ప మరో హిట్ లోని జాతీయ ఉత్తమ నటుడు విక్రమ్ ప్రయోగాత్మక చిత్రం 'నాన్న"తో వస్తున్న విషయం తెలిసిందే..అపరిచితుడు తర్వాత ఆ క్రేజ్ తో డబ్బింగ్ నిర్మాతలు పదుల సంఖ్యలో విక్రమ్ సినిమాల్ని తెలుగులోకి దించారు. కానీ, ఏ ఒక్కటీ ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు. ఎన్నోఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన 'మల్లన్న" పెద్ద డిజాస్టర్ అయింది.
తమిళంలోనూ క్రేజ్ కోల్పోతున్న విక్రమ్ కు 'దైవతిరుమగళ్" తప్పనిసరిగా హిట్ సినిమాగా నిలబడాలి. అయితే ఇది ఎక్స్ పెరిమెంటల్ మూవీ కావడంతో కమర్షియల్ గా వర్కవుట్ అవడం కష్టం అన్నది సినీవర్గాల అభిప్రాయం. ప్రస్తుతం నాన్న పోస్ట్ ప్రొడక్షన్ లో వుంది..మరో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఎంతో ఇష్టపడి చేసిన 'నాన్న"తనకు మంచి పేరు తెస్తుందని విక్రామ్ చాలా కాన్ఫిడెన్స్ తో వున్నాడు. జూలై15న తమిళ్, తెలుగులో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం విక్రమ్ కెరీర్ ని ఎలా టర్న్ చేస్తుందో వెయిట్ అండ్ సీ..


Click it and Unblock the Notifications











