Don't Miss!
- Sports India squad for T20 World Cup: ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు.. తెలుగోడికి నో ఛాన్స్!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Automobiles క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్ సినిమాలకు తమిళంలో డిమాండ్... మరో మూవీ రీమేక్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' 2014లో విడుదలై మంచి విజయం అందుకుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూపించాడు. మంచి కంటెంట్ ఉన్న హిట్ మూవీ కావడంతో తమిళంలో విశాల్ హీరోగా ఈ చిత్రం రీమేక్ అయింది.
తాజాగా ఎన్టీఆర్ నటించిన మరో మూవీ తమిళంలో రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'నాన్నకు ప్రేమతో' 2016 సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది.
ఈ మూవీ కేవలం తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు అదరగొట్టడమే కాదు... ఎన్టీఆర్ కెరీర్లో యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 2 మిలియన్ డాలర్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. ఫాదర్ సెంటిముంటుతో కూడిన ఈ చిత్రాన్ని త్వరలో తమిళంలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట.
అయితే తమిళంలో ఎవరు దర్శకత్వం వహిస్తారు? ఎన్టీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారు? అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. కాగా... ప్రస్తుతం ఎన్టీఆర్ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అరవింద సమేత' చిత్రం చేస్తున్నారు. ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ దసరా సందర్భంగా విడుదల కాబోతోంది. ఈచిత్రం తర్వాత ఆయన రాజమౌళి మూవీలో నటించబోతున్నారు.