అందాల రాక్షసి హీరో నగ్నంగా షాకింగ్ లుక్ (ఫోటో)
హైదరాబాద్: అందాల రాక్షసి చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర త్వరలో ఓ తమిళ చిత్రంలో నగ్నంగా షాకింగ్ లుక్‌లో దర్శనమివ్వబోతున్నాడు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోను నవీన్ చంద్ర తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసాడు. 'తేరోడుం వీదియిలే' అనే టైటిల్ తో తెరకెక్కే ఈ తమిళ చిత్రంలో పాయల్ ఘోష్ హీరోయిన్.
నవీన్ చంద్ర తెలుగు ప్రాజెక్టుల విషయానికొస్తే....అనురాగ్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. గత నెలల ఈచిత్రం ప్రారంభైంది. నవీన్ చంద్ర, నివేదా థామస్ లు జంటగా అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.రఘుబాబు, కె.బి.చౌదరిలు అజయ్ వొద్దిరాల దర్శకత్వంలో సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ తెలుగు సినిమా గురించి నవీన్ చంద్ర మాట్లాడుతూ...కథానాయకుడు నవీన్ చంద్రమాట్లాడుతూ అందాల రాక్షసి, దళం, నా రాకుమారుడు చిత్రాల తరువాత ఒక విభిన్నమైన పాత్ర కోసం ఎదురు చూస్తుండగా నాకు దొరికిన చిత్రమిది. అజయ్ చిత్రాన్ని చిత్రంలోని పాటలని అద్భుతంగా తీర్చి దిద్దారు అన్నారు.
తాను బ్రతకడం కోసం ఈ ప్రపంచంలోని ఏ వస్తువునైనా అమ్మేసే ఓ యువకుడు . తన ప్రేమ విషయంలో ఎలా వ్యవహరించాడు అనేది క్లుప్తంగా చిత్ర ప్రధాన కథాంశం. ఈ చిత్ర దర్శకుడు అజయ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద శిష్యరికం చేసాడు. ఆర్య, జగడం,ఆర్య2 చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేశాడు.


Click it and Unblock the Notifications











