»   »  వేశ్యగా నవనీత్ కౌర్....

వేశ్యగా నవనీత్ కౌర్....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Navneet Kapoor
'శ్రీను..వాసంతి...లక్ష్మీ' సినిమాతో తెలుగు వారికి పరిచయమైన పంజాబీ భామ నవనీత్ కౌర్. ఆ తర్వాత ఆమె వరసగా ఫ్లాప్ సినిమాల్లో నటిస్తూ పోయింది. దాంతో సినిమాల సంఖ్య పెరిగింది కానీ పెద్దగా ఒరిగిందేం లేదు. అవకాశాలు పెరగలేదు. ఇప్పడు అలాంటి పేరు తెచ్చే పాత్ర చేస్తున్నానంటోంది. అది కరీనాకపూర్ వేశ్యగా నటించి పేరు తెచ్చుకున్న 'ఛమేలీ' చిత్రంతోనట. ఇప్పుడా చిత్రం తమిళ్ లోకి 'Arasangam' పేరుతో రీమేక్ అవుతోంది. ఆ పాత్రకి కరెక్టుగా ఎవరు సూటవుతారా అని ఎంక్వైరీ చేస్తే నవనిత్ కౌర్ గుర్తుకు వచ్చిందిట.

పాత్ర కన్ ఫర్మ్ అయ్యాక నవనీత్ కౌర్ ఆ సినిమాని తెచ్చుకుని చూసిందిట. అంతే అంత అద్భుతమైన పాత్రని ఇన్నాళ్ళు ఎలా మిస్సయిపోయింది అన్న భావన ఆమెని వెంటాడుతోందిట. అంత ఎమోషనల్ ధీమ్ లోకి ఒరిగిపోవటానికి ఆమె ఆ సినిమాని చాలా సార్లు చూసిందిట. దర్శకుడు సుధీర్ మిశ్రా సినిమాలో ఆమెను తప్ప మరొకర్ని ఊహించుకోవటం కష్టం అంటున్నాడు. ఇక హిందీలో కమర్షియల్ గా పెద్ద విజయం సాధించని ఆ సినిమా విమర్శకుల మెప్పును,అవార్డులను పొందింది. కాని తమిళంలో మాత్రం డబ్బులు కూడా రాబట్టాలనే లక్ష్యంతోనే చేస్తున్నారట. అంటే మంఛిగా ఎక్స్ పోజింగ్ ఉంటుందని నవనీత్ కౌర్ అభిమానులు సంబరపడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X